భూమి గుండ్రంగా ఉండదా?
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దిన పత్రిక - సంపాదకీయ పుట( 29 - 11 - 1902 ) ప్రచురితం. )
' భూమి గుండ్రంగా ఉండకూడదనేందుకు వంద రీజన్లున్నాయ్! . ముందు సంతకం చెయ్యీ' అంటూ ఓ కిలో కాగితాల కట్ట నా మొహాన కొట్టి కూర్చున్నాడు లోక నాథం.
అప్పటికే అందులో ఓ ముప్పావుకిలో కాగితాలమీదేవేవో సంతకాలు గిలికున్నాయి.
కరెంటు సమస్య, నీటి సమస్య, కరవు సమస్య, కండోమ్ సమస్య.. వగైరాలిన్నుండగా కొత్తగా ఈ భూమి గుండ్రం సమస్య ఎక్కణ్ణుం చి ఊడిపడిందో.. అర్ధం కాలేదు. అదే అడిగా.
' అన్ని సమస్యలకీ అదే మూలంరా బాబూ! ముందు మనముండే ఎర్త్ ఏ ఆకారంలో వుందో కూడా తెలుసుకోకుండా.. తతిమ్మా సమస్య ల్నెలా సాల్వు చేస్తామో చెప్పు! వాస్తు ప్రకారం ఏ వస్తువైనా వృత్తాకారంలోవుందంటే దానికేదో మూడిందనే అనుకోవాలని మొన్న పార్లమెంటు భవనాన్ని పరిశీలించిన గణితాగమశాస్త్ర పారంగతులు కూడా కుండబద్దలు కొట్టి నట్లు చెప్పారు కదా! పార్లమెంటులోని గందరగోళానికి పార్లమెంటు గోళాకారంలో వుండటమే అసలు కారణమని వాళ్లేమన్నా వేళాకో ళానికి అన్నారనుకున్నావా ? కెనడా వాళ్ల సాక్షిగా లడాయి చేసుకున్నారని మనాళ్లనలా పాపం. . ఆడిపోసుకుంటున్నాంగానీ, వాస్తు దోషాలున్న వేదికమీద కాళిదాసైనా దేవదాసులాగయిపోవాల్సిందేనని శాస్త్రమే నొక్కిచెబు తోంది.
భూమి కూడా కపిద్ధాకారంలో గుండ్రంగా వుందనే గదా మనుధర్మ శాస్త్ర చెబుతోందని మన గిరీశమంటున్నదీ! అందుకేనేమో మొన్న అమెరికాలో డబ్ల్యూటీవో అలా పేకముక్కల్లా కూలిపోయింది. అంతకు ముందు యూఎస్సెస్సారూ ముక్కలు చెక్కలయిందీ. సద్దాంతో యుద్ధమలా సాగుతూనే వున్నదీ.. బ్రహ్మాండం గుండ్రంగా వుండబట్టే. ఇండియాలో ఇప్పుడిన్ని బర్నింగ్ ప్రాబ్లమ్స్ మేప్ తూర్పు దిక్కున అడుగు భాగాన్నలా పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతున్నాయి గనకనే ఇండియా.. శ్రీలంక టెరిటరీల్లో టెర్రరిస్టులలా రెచ్చిపోతున్నారని నా థియరీ! అందుకే ముందర్జంటుగా మనంభూమిని చదును చేసెయ్యాలి. నీ వంతు చందా వందో.. వెయ్యో . . అర్జంటుగా వెయ్యి! అవతల చాలా ఇళ్లున్నాయ్ ' ఆవటా అని మహతొందరచేశాడు మా లోకనాథం.
చందాదందాల్లాంటివో లేనిదే మా లోకనాధంలాటి గల్లీ లీడర్లు లోకోపకారం లైన్లోకి రానే రారు.
భూమిని ఫ్లాట్ చేయాలంటే మాటలా? .. మూటల్తో పని. ఏ అమెరికా. .. బిల్ గేట్స్ వంటి వాళ్ల పూనిక లేనిదే పూర్తికాని పని. లోకనాథంలాంటి లోకల్లీడర్లతో అయేదేనా?
'అందుకేగా ఇంటర్నెట్లో వెబ్సైట్ పెట్టిందీ! డబ్బులు. డబ్బులు.. డబ్బులూ .. అదేదో డాట్కామని దాని పేరు. అన్నాడు లోకనాథం చందా బుక్కు నాముందుకు తోసి.
' ఎర్త్ డీమాలిషింగ్ ఆపరేషన్ డి.ఎ డ్రామాలో టెంపరరీగా ప్రజల్ని చంద్రమండలం మీదికి షిఫ్ట్ చెయ్యాలి. డొనేషన్ని బుట్టే ప్రియారిటీ. ఆనక చెప్పలేదని దెప్పద్దన్నా!' అని హెచ్చరిక .
'ఓ వెయ్యి రూపాయలేగా! పారేద్దురూ! . పై పోర్షను వాళ్లయిదొందలే ఇచ్చారు. వాళ్ల కంటే మనమే ముందుండాలి మూన్ – ట్రావెలింగ్ లో అంటూ మా శ్రీమతి తొందర! ఏదో వంకతో చంద్రుడి మీద ఇంచకా చక్కర్లు కొట్టిరావచ్చన్న ఆవిడ ఉబలాటం బాగానే వుందికానీ, ఇదంతా వింటుంటే కట్టెతుపాకీ పట్టుకొనే పిట్టలదొర చెప్పే కట్టుకథలాగుంది.
జన్మభూమంటే అందరూ నమ్ముతారు గానీ, జన్మగ్రహమంటే అంతపనమ్మకమా? అన్నాడాగ్రహంగా లోకనాథం.
ఢిల్లీ నుంచి దౌల్తాబాదుకూ... దౌల్తాబాదు టు ఢిల్లీకి మళ్లీ మళ్లీ తుగ్లక్ అలా రాజధాన్ని మార్చంగా లేంది .. టెక్నిక్కింత బాగా డెవలప్పయిన రోజుల్లో ఆఫ్టరాల్ చంద్రమండలం మీదికి పోయి రాలేమా' .. అని గద్దించాడు లోకనాథం.
' నాన్ సెన్స్! దిసీజ్ నాన్ సెన్స్ ' అన్నాడు స్వామినాథం, సాయంత్రం టౌన్ హాలు మీటింగులో.
' చందాలు దండుకోవాలని భూమి గుండ్రంగా వుందని పూరికే బుకాయిస్తున్నారు. ఇన్ ఫాక్ట్ ఎర్ ఈజ్ ఫ్లాట్'
అని స్వామినాథం గద్దింపు .
లోకల్ గవర్నమెంటు కాలేజీలో జాగ్రఫీ లెక్చరర్ గా రిటైరై రాజకీయాల్లోకొచ్చిన మేధావాయన .
' భూమి బల్ల పరుపుగానే ఉంటుందనడానికి లక్ష కారణాలున్నాయి. అమరంలోఅవనికి అరయ్యేడు పదాలన్నాయ్. అందులో
ఒక్కటీ పృథ్వి గుండ్రంగా వుందంటే వప్పుకోదు . ప్రాచీన సాహిత్యంలో భూగోళం పేరుమీద రాసిన గ్రంథం కలికమేసి చూసినా ఈ థియరీ దొరికి చావదు. నలుచదరంగా వున్న ధరాతలాన్ని అష్టదిగ్గజాలూ, ఆదిశేషుడూ,ఆదిమకాలం నాటి నుంచే ధరించి భరిస్తున్నాయని మన పురాణాలు ఘోషిస్తునే ఉన్నాయి. ఎర్త్ ఈజ్ ఫ్లాట్ థీరీ బైబిలు కన్ ఫాం చేస్తోంది. హెర్కులిస్ మోసిన అట్లాస్ పెనం మీది పెసరట్టులాగా పల్పగానే వుంటుందనటానికిఇంతకన్నా పెద్ద ఆధారాలింకేంకావాలీ? ' అని గద్దించాడు స్వామినాథం
చప్పటు.
అమరం చదివిన మేధావి. కావ్యాన్ని కడిగి పారేశాడని మెచ్చుకున్నారె వరో .
లోకనాథానికంత పురాణ జ్ఞానం లేకపోయినా, పబ్లిక్ ముందు లోకువయిపోతామనేమో వేదిక మీదికి దూకి వాదన మొద లుపెట్టాడు. భర్తృహరి భూమి అత్తికాయ లాగా ఉందన్నాడు కదయ్యా! '
' అదే భక్త హరి మరోచోట భువనం భవనంలాగా ఫ్లాటుగానే వుందున్నాడు కనయ్యా? . బమ్మెర పోతనగారు కమలపత్రులాగా వసుంధర వర్తులాకారంలో వుంటుందన్నారు. ఎమోషన్లో కవులేవేవో అంటుంటారు. వాట్నే పట్టు క్కూర్చుంటే ఎలా? ఫ్లాట్ అంటే అర్థమేంటి ? ఫ్లాట్గా వుండేదనేగా ! భూమి గనక మైదానంలాగా చదునుగా లేకపోతే జయలలిత, లాలూలాంటి లీడర్లు పిల్లల పెళ్లిళ్లప్పుడు ఆకాశమంత అరుగు ఎలా వేయగలరూ ? చాపలా వుంది కాబట్టే చుట్టచుట్టి హిరణ్యా క్షుడు సముద్రంలో గిరాటేశాడు. భూమిప్పుడు చుట్టులా ఉందనడానికి ఇదే పెద్ద ప్రూఫు. దాన్ని సాఫు చెయ్యడానికే ఇప్పుడు చందాలు కావాలి' అన్నాడు లోకనాధం.
' కానీ ఇవ్వం. కావలిస్తే బిల్ గేటు గేటు ముందు అడుక్కో!
ఎయిడ్స్ డాలరొకటి విండోస్ గుండా విసిరేస్తాడేమో! ' .
అరపులా.. గోలా.. అరక్షణంలో అసెంబ్లీ వాతావరణం !
ఎక్కణ్ణుంచో ఓ నాణెం స్టేజీ మీదకొచ్చి పడింది.
డాలరు లాగుంటే కళ్లకద్దుకుని జేబులో వేసుకున్నాడు గుర్నాథం.
'ఢామ్' అని పేలింది!
---
మర్నాడు పేపర్ల నిండా అదే న్యూస్ .
న్యూసా? న్యూసెన్సా? అదేమో గానీ, ఇన్నోసెన్స్ .. ఇగ్నోరెన్స్ ! టిలీల నిండా చర్చలే.. చర్చలు!
' భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపు గా ఉందా ? గుండ్రంగా ఉంటే మరమ్మత్తులకు చందాల వసరమా? కాదా?
ఇంటర్నెట్లతో సహా అంతటా.. ఒపీనియన్ పోల్స్!
ఆ పాయింట్ మీద తమ స్టాండేదో వెల్లడించక తప్పని దుస్థితి అన్ని రాజకీయ పార్టీలకు వచ్చి పడింది !
ఈ సారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెల్సినా ఈ ఎజెండా మీదనే!
---
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చెంచునాథం బజార్లో కనిపిస్తే ఆపి అడిగా
'ఇంతకీ నీ భూమి గుండ్రమా? బల్లపరుపా ? '
చెంచునాథం లోకనాథానికి స్వయానే బావమరిది. స్వామినాథానికి మేనల్లుడుకూడా.
అందుకే ఇబ్బందిగా నవ్వుతూ ' ఇంట్లో గుండ్రం.. బైటి బల్లపరుపు ' అని దాటేశాడు.
పార్టీ గుర్తు వాస్తు బాగా లేక లోకనాథం పార్టీ ఓడిపోయిందీ సారి.
'సారీ' చెప్పటానికి వెళ్లి కల్సినప్పుడు 'పర్లేదులే.. అందా, మనవాళ్లేగా! ' అవి నవ్వేశాడు క్రీడాస్ఫూర్తితో .
' వచ్చే ఎన్నికల్లో మా భూమిగుండ్రం పార్టీనే గెలుస్తుంది. ఈసారికైతే కరెంట్ కరపు లాంటి ప్రాబ్లమ్స్ ! సాల్వ్ చేసే బాధ తప్పింవికదా ! అన్నాడు లోకనాథం.. అక్కడే వున్న స్వామినాథం వంక చూసి కన్నుగొడుతూ .
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దిన పత్రిక - సంపాదకీయ పుట( 29 - 11 - 1902 ) ప్రచురితం. )
- కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment