చిన్న కథ :
కామన్ సైన్స్
- కర్లపాలెం హనుమంతరావు
( చతుర- ఫిబ్రవరి - 2010 - ప్రచురితం )
ఓ కోటీశ్వర్రావుగారు ఇంటికి కాపలా కాసే వాచ్మన్ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
చివరి వడపోతలో ఇద్దరు కేండిడేట్లు మిగిలారు.
కోటీశ్వర్రావుగారు “గిన్నెలో నెయ్యిపోసి ఎండలో బెడితే ఏమవుతుంది?" అనడిగాడు ఇద్ద రినీ కలిపి కూర్చోబెట్టి.
"సూర్య కిరణాలు సోకి ఆ వేడికి నెయ్యి కరి గిపోతుంది సార్!" అన్నాడు మొదటివాడు కాన్ఫిడెంటుగా,
"కుక్క గిన్నె ఎత్తుకుపోతుంది సార్!" అన్నాడు మొదటివాడికన్నా వయసులో కాస్త ఎక్కువ ఉన్నవాడు వినయంగా.
"మీ ప్రశ్నకు సైంటిఫిక్ గా, చక్కగా సమాధానం చెప్పిన మొదటి అబ్బాయికే న్యాయంగా ఉద్యోగం దక్కాలి కదా!" అంది అక్కడే ఉన్న కోటీశ్వర్రావుగారి
"వాచ్మనుకు ఉండాల్సింది సైన్సు కాదమ్మా! కామన్ సెన్సు" అంటూ రెండోవాడికి ఉద్యోగం ఇచ్చేశాడు కోటీశ్వ రావుగారు.
ఆరోజు రాత్రి పడగ్గదిలో భార్య కోటీశ్వర్రావుగారిని నిలదీసింది. "మీ సెలెక్షన్ బాగా లేదని అమ్మాయి ఒహటే గుణుస్తుంది పొద్దుట్నుంచీ . దాని చూపంతా ఆ మొదటబ్బాయి మీదే ఉందండీ!"
" అందుకనే పిచ్చి మొద్దూ.. రెండోవాడిని సెలెక్టు చేసిందీ! చెప్పాగా ఎవరికైనా సైన్సుకన్నా కామన్ సెన్సే ముఖ్యమనీ" అన్నాడు కోటీశ్వర్రా వుగారు తాపీగా .
- కర్లపాలెం హనుమంతరావు
( చతుర- ఫిబ్రవరి - 2010 - ప్రచురితం )
No comments:
Post a Comment