కవిత :
ఆ సాష్ట్ వేర్ వేరు .. ఈ సాఫ్టువేరు వేరు
-కర్లపాలెం హనుమంతరావు
01 - 01-2021
ఇంటెడు చాకిరి చేసి చేసి బండబారిన చేతులతో - అమ్మ
తలస్నానం చేయిస్తూ కళ్ళ మీద పడ్డ సబ్బు నురుగుల్ని సుతారంగా తుడిచేసే స్పర్శ
అక్షరాభ్యాసంలో ఓనమాలు దిద్దిస్తూ పలకమీద నా వెళ్ళను నడిపించిన నాన్న గుప్పెట పట్టు
అద్దె సైకిలు తొక్కుతూ పడి
మోకాలు చిప్పలు చెక్కుకున్నప్పుడు
తుపుక్కుమని ఇంత ఉమ్మి
నా ఎరుపు గాయానికి పులిమిన అన్న
అరచెయ్యి వెచ్చనిదనం
ఎక్కాలు వప్పచెబుతూ వరస తప్పించినందుకు
గుడ్లింత చేసుకొని నొప్పి లేకుండా చెవితమ్మలు అక్క నొక్కిన వైనం
ఎన్ని ఇంటర్నెట్లు వుంటే ఏంటి
ఆ సాఫ్ట్ వేర్ వేరు
ఈ సాఫ్టు వేరు వేరు
రెండూ వేరు - వేరు
- కర్లపాలెం హనుమంతరావు
01- 01- 2021
No comments:
Post a Comment