ఒక చిన్న కథ
- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
( పాత భారతి మాసపత్రిక నుంచి సేకరించినది. )
ఒక దేశంలో ఒక రాజు న్నాడు. అతని వద్దకు ఒక బీద వాడు వచ్చాడు. ఆబీదవాడు తన కూతుర్ని వివాహ మాడటానికి తన పేదరికం చే భయపడుచున్నాడని రాజు అనుకున్నాడు. . అనుకుని అ పేదవానితో "నాకూతురుతో పాటు ప్రస్తుతం సగం రాజ్యము వస్తుంది. నాతదనంతరం మిగతా రాజ్యం వస్తుంది" అని ఆపేదవాని మెడలో పూలహారం వేళాడు.
ఆ పేదవాడు హారమును మెడలో నుండి తీసి వేసి "ఏమిటీ పిచ్చి నేను పెండ్లి చేసుకోను' అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.
కాని రాజుగారి కూతురు మాత్రం “యీ పేదవానిని ఎటులయినా సాధించి పెళ్ళి అయినా చేసుకోవాలి, లేకపోతే ప్రాణాలైనా విడవాలి అని” అతనిని తీసుకు రాపడానికి వెంబడించింది.
రాజా గారు, అతని అనుచరులు వీరిద్దరిని వెంబడించారు. ఈ పేదవాడు కొన్ని మైళ్ళు నడిచి, కొన్ని మైళ్ళు పరుగెత్తి ఒక ఆడవిలో ప్రవేశించాడు. ఆ అడవి యితనికి చిరపరిచయంలాగ కడనిపించింది. అడివిలోని మర్మాలన్నీ యితనికి విశదమేనని స్ఫురించింది.
ఇట్లుండగా సాయంకాలమై చీకట్లావరింప మొదలిడాయి. చీకట్లో ఒక దూకు దూకి పేదవాడు మాయిమై పోయినాడు.
రాకుమారి వెతికి వెతికి వేసారి నిరాశ చేసుకుని ఆడివిలోనుండి బయటికి పోయేమార్గం తెలిసికోలేని దుస్థితిలో ఒక చెట్టుకింద చతికిలబడింది.
ఇంతలో రాజును ఆటవికులు సమీ పించి "విచారింపకు. అడివిలోనుండి బయటకు పోయే దారి మాకు తెలుసు. అయితేయిపుడు గాడాంధ కారం అంతటా కమ్ముకుంది. యిపుడు దారి తెలుసుకోలేము. ఇదుగో యిక్కడొక పెద్ద చెట్టుంది. దాని క్రింద యీరాత్రికి విశ్రమిద్దాము . ఉదయం కాగానే లేచి పోవచ్చును" అని అన్నారు.
ఆ చెట్టు మీద ఒక పక్షి కుటుంబం గూడు కట్టుకుని కాపురం చేస్తూంది. ఒక మగపక్షి. ఒక ఆడపక్షి మూడు చిన్న పక్షులు ఉన్నవి. మగపక్షి క్రింద వున్న వారిని చూచి భార్యతో యిట్లు చెప్పింది. "చలి అతి తీవ్రంగా ఉంది. ఇక్కడ చాలామంది అతిధులు పరున్నారు. చలి కాచుకోవహానికి ఏమీ లేదు .. అంటూ ఆంతట యెగిరి వెళ్ళి ఎచ్చటనో ఎండినపుల్లలను ముక్కుతో కరచుకొని ఆతిధులముందు పడవేసింది.
వారు వాటి సహాయంతో మంట చేసుకున్నారు. అయినా మగపక్షికి మాత్రం తృప్తి కలుగ లేదు. భార్యతో మళ్ళీ యిట్లా చెప్పింది.
"ఇప్పుడేం చేద్దాం. ఆతిధులకు తింటాని కేమీ లేదు. వారు ఆకలితో పరున్నారు . మనం సంసారులము. అతిథులను మర్యాద చేసే లక్షణం గృహస్తునిది. కనుక నా శక్తికొలది సహాయం చేయాలి. నా శరీరాన్ని వారి కిచ్చి వేస్తాను" అని ఆమండుతూన్న మంటలో పడుతూండగా అతిధులు చూచి రక్షించటానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది.
తన భర్త మంటలో పడిపోవటం చూచి ఆడపక్ష్మి తనలో తానిట్లనుకుంది.
“ చెట్టుకింద పెక్కు రతిథులున్నారు . వారికి తినుటకు ఒక పక్షే ఉంది. అది చాలదు. నా భర్త ప్రారంభించిన కార్యం ఆసంపూర్తిగా విడవటం నాధర్మం కాదు. కనుక నాశరీరాన్ని కూడా వారి కర్పించుకుంటాను” అని అనుకుంటూ ఆడపక్షికూడా మంటలో పడింది.
మూడు చిన్న పక్షులును తమ తలితండ్రులు చేసిన పనిని చూచి వారి పనిని అసంపూర్తిగా వదలటం బిడ్డలుగా ధర్మం కాదని అనుకుని అవికూడా మంటలో వడ్డవి.
కిందనున్నవారు ఆత్యాశ్చర్యముతో చూడసాగారు. వారు తిండిలేకనే రాత్రి గడిపివేసి యిటువంటి ఉదారస్వభావం గలిగిన పక్షుల మాంసము తినడంకంటె తిండి లేక చనిపోవడమే ఉత్తమనసుకొని వుదయమున నే లేచి యింటికి వెళ్ళారు.
మంత్రివర్యున కీపమాచారమును వినిపించగా అతడు ఈ విధమున జవాబిచ్చాడు.
" ఓరాజా, యెవరి స్థానములో వారు గొప్ప అని నీవు దృష్టాంతపూర్వకముగా చూచావు . ప్రపంచంలో జీవించాలంటే ఆపక్షుల మాదిరిగా జీవించవలె. ఏక్షణమున కాక్షణము ఆత్మార్పణం చేసుకోటానికి సంసిద్దంగా ఉండాలి. ప్రపంచాన్ని నీవు విసర్జించాలంటే అందమైన కూతుర్ని రాజ్యాన్ని ఒక్కసారిగా తృణీకరించి వైచిన ఆ పేదవానిని అనుసరించు. నీవు గృహస్తుగా ఉం డాలంటే యితరుల క్షేమం కోసం నీ ప్రాణాన్ని అర్పించుకో. కనుక అందరు తమ తమ స్థానాల్లో గొప్పవారే. ఒకరికి విధికృత్యమైతే మరొకరికి విధికృత్యంగాదు.
( భారతి - కథ )
No comments:
Post a Comment