""
జార్ ప్రభువుల కాలంలో 'కౌంట్' అనేది ఒక రకమైన రాజగౌరవ
చిహ్నం.ఇప్పటి మన మిలటరీ హోదాలాగా. విఖ్యాత చక్రవర్తి పీటర్
కాలంలో టాల్ స్టాయ్ వంశం వారికి అలాంటి 'కౌంటు' బిరుదు దక్కింది. ఆ బిరుదు వచ్చిన విధానాన్ని గురించి ఒక తమాషా కథ ప్రచారంలో వుంది.
జారు చక్రవర్తిని
కలుసుకోవాలని ఒకసారి ఒక ఉన్నత వంశం తాలూకు పెద్దవ్యక్తి(ఆ దేశంలో అటువంటివాళ్లను 'ప్రభువు' అంటారు)వేళకాని వేళలో అంతఃపురానికి వచ్చాడు. ద్వారం దగ్గర
కాపలాకాసే సైనికుడు ఆ ప్రభువును అడ్డగించాడు. ఆ ప్రభువుకి ఆ
సమయంలో లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒక మామూలు
ద్వారపాలకుడు తనని అడ్డగించడం ఆ ప్రభువుకు ఆగ్రహం తెప్పించింది. "నేనెవరో తెలిసే అడ్డగిస్తున్నావా?" అని
గర్జించాడు ఆ ప్రభువు. "చిత్తం. మిమ్మల్ననే
కాదు ఎవర్నైనా సరే.. ఈ సమయంలో లోనికి అనుమంతించడానికి నాకు ఆదేశాలు లేవు. మీరు దయచేసి రేపు తగిన అనుమతితో రండి. తప్పక లోపలికి
వెళ్ళవచ్చు" అన్నాడు ద్వారపాలకుడు వినయంగానే. ఐనా ఆ
ప్రభువుకి ఇది ధిక్కారంలాగే అనిపించింది. "నీ
అహంకారానికి బహుమానమేమిటో తెలిసే అలా మాట్లాడుతున్నావా?"
అని హూంకరించాడు. ద్వారపాలకుడినుంచి మౌనమే సమాధానం.
ప్రభువుకి కోపం కట్టలు
తెగింది. చేతిలోని కొరడాతో ఆ సైనికుడిని వళ్ళంతా రక్తాలు కారేటట్లు కొట్టటం మొదలు
పెట్టాడు.
నొప్పులన్నీ మౌనంగా
భరింస్తున్నాడే కానీ ఎదురు తిరగలేదు.అలా అని
దొరను లోపలికి అనుమతించనూ లేదు ఆ సైనికుడు.
అదే సమయంలో పీటర్ మహారాజు
అటుగా వస్తూ ఈ దృశ్యం చూశాడు. ఏం జరుగుతుందో ముందు
అర్థం కాలేదు. తెలిసిన తరువాత అంతులేని ఆశ్చర్యం ఆగ్రహం
కలిగాయి. ద్వారపాలకుడితో "ఆ
ప్రభువు నిన్ను అలా గొడ్డులా మోదుతుంటే ఒక సైనికుడివి అయి వుండీ మౌనంగా భరిస్తావా! ఇదిగో కొరడా.. ఇప్పుడు నీ ప్రతీకారం యథేచ్చగా
తీర్చుకోవచ్చు" అని కొరడా అందించాడు.
ఆ మాటకు ప్రభువు అభ్యంతరం
చెప్పాడు "మహారాజావారు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అతనొక తుచ్చ సైనికుడు.
నేనేమో ప్రభువును. ఎలా దండిస్తాడు?"
"అదే
అభ్యంతరమైతే నేనతన్ని ఈ క్షణమే జనరల్ చేస్తున్నాను" అన్నాడు పీటర్.
"జార్
చక్రవర్తులు క్షమించాలి. ఒక గొప్ప వంశస్థుడ్ని ఒక క్షుద్ర
సేద్యగాడు శిక్షించడం మన సంప్రదాయం ఏమాత్రం ఒప్పుకోదు" అన్నాడు మళ్ళీ
పెడసరంగా.
పీటరు చక్రవర్తికి అతని
దుష్ప్రవర్తన సహించరానంతటి క్రోధం తెప్పించింది.
"ఈ
ద్వారపాలకుడికీ తక్షణమే 'కౌంట్' బిరుదు
ప్రసాదిస్తున్నాను. నా పాలనలో కౌంటులు ఆత్మగౌరవం లేనివారిగా
ప్రవర్తించడం నాకు అవమానం" అని ఉరిమి చూసాడు ద్వారపాలకుని వైపు.
అంతే.. రాజుగారి
సమక్షంలోనే రాజావారి కొరడాతోనే రాజగౌరవం నిలబడేటట్లు కొత్త కౌంటు ఆ ప్రభువుని
మళ్ళీ లేవలేని విధంగా దండించి
వదిలిపెట్టాడు.
మర్నాడే ఆ కౌంటుకు 'జనరల్' పదవి కూడా ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
'కౌంట్'
బిరుదూ రాజుగారి స్వహాస్తాలతో ప్రసాదించబడింది.
'వార్ అండ్
పీస్' లాంటి ఎన్నీ అత్యున్నమైన మానవతావాదాన్ని బలపరిచే రచనలు
చేసిన గొప్ప రచయిత లియో టాల్ స్టాయ్ కి
కౌంట్ బిరుదు అలా వారసత్వంగా వచ్చిందే.
అలాంటి రాజచిహ్నాలు
ప్రజాస్వామ్యవాది అయిన టాల్ స్టాయికి ఇష్టముం
డేవి కాదు. వాటిని తొలగించుకోవడాని
తరువాత చాలా తంటాలు పడ్డాడనుకోండి..అది వేరే కథ
***
Friday, November 8, 2013
No comments:
Post a Comment