1
పాండవులు
కనిపించరు
పాత 'మాయాబజారు'
కౌరవులూ
కనిపించరు
కొత్త
మాయ 'బజారు'
తస్మాత్
జాగ్రత్త!
2
నరికితే
చచ్చేందుకు
చెట్టు
మనిషి
కాదు
-చివురు
3
ఆలూమగలు
పాలు-
నీరు
ఎవరి
పాలు ఎంతో
తేలకే
పోరు
4
తెలుగుగంగ
సరే
తెలుగూ
గంగలో
కలుస్తున్నదే!
5
అగ్నిసాక్షిగా
అయింది పెళ్ళి
అగ్గే
బుగ్గిచేసింది మళ్ళీ
అగ్గీ! నువ్వు అత్తారికి
అంత
దగ్గరి చుట్టమా!
6
అశోకవనంలో
అందరి మధ్యున్నా
సీతమ్మకు
అగ్నిశిక్ష!
అంతఃపురాన
ఒంటరిగా పడుకున్నా
రామయ్యకు
లేదే పరీక్ష!
ఏం
కలికాలంరా బాబూ!
త్రేతాయుగం!
7
మన
చట్టసభల మెడలో
వేలాడదీయాలనుంది
'ఐ నెవ్వర్ స్పీక్ ఇంగిలిపింగిలీస్'
పలక!
-కర్లపాలెం హనుమతరావు
No comments:
Post a Comment