సిగ్మా.. సిక్స్ !
( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )
సిక్స్ పేరు విన్నావా?
ఏంటో తెలీదుగురూ!?
అనుకున్నాలే.. సిగ్మా అనగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడయినా గుర్తుకొచ్చివుంటే బాగుండేది.
విషయం చెప్పు ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటున్నది సిగ్మా గురించా .. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించా?
రెండూ కాదు... చిన్నప్పటి మావూళ్ళో తిప్పడి గురించి...
తిప్పడి గురించి చెప్పుకోటానికేముంటుందబ్బా! సరే చెప్పు ! లింకులేకుండా నువ్వే డొంకా కదిలించవులే..!
ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీనేషనల్ కంపెనీలన్నీ 'ఎర్రర్ ఫ్రీ ' ఆపరేషన్ల కోసం కొన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాయి. అయినా నూటికో కోటికో ఓటన్నా తప్పు జరగనే జరుగుతుందికదా?
కోటికో తప్పంటే అంత చెప్పుకోనక్కర్లేడనుకో
కోటికో తప్పైనా తప్పు తప్పే ..! ఒకపాయింట్ మిలియన్ ఫ్రాక్షన్ మిస్టేకొచ్చినందుకేగదా మొన్నామధ్య సూపర్సానిక్ స్క్రామ్ జెట్టాపరేషన్ అలా ఫెయిలయిందీ! కొన్ని మిలియన్ డాలర్ల మనీ వూరికే అలా గాల్లో ఆవిరయిపోయింది..! పవర్ గిర్ట్స్
తరచూ ఫెయిలై రాష్ట్రాలకు రాష్ట్రాలు రోజుల తరబడి చీకట్లో కూరుకుపోయినా, మనవాళ్ళకు చీమకుట్టినట్లయినా వుండదు. కానీ పర్ఫెక్షన్ కోసం పడి చచ్చేవాళ్ళకి పాయింట్ జీరో జీరో జీరో జీరో జీరో డిఫరెన్సొచ్చినా సహించ లేరు తెలుసా! ఫరెగ్జాంపుల్... మన ముఖ్యమంత్రిగారి ఫ్యూచర్ జె.డి.పి ఫిగర్ చూడు!
విదేశాన్నుండి వచ్చిన మినిస్టరొకాయన మా దేశంలో ఇలాంటి ఫిగర్లు చూపిస్తే పిచ్చాసుపత్రిలోనో.. జైల్లోనే జాయిన్ చేస్తారన్నట్లు గుర్తు!
విదేశస్తులకిలాంటి విజన్లు అర్ధంకావు. కానీ నిజానికా విజన్ ప్లాను ప్రకారం చేస్తే సూపర్ విజన్ అవుతుందని మన ముఖ్యమంత్రిగారి ప్రగాఢ నమ్మకం . దానికే ఆయన పాపం, రాత్రి నిద్రలు కూడా జాతికి త్యాగం చేసి ఇరవైనాలుగ్గంటలూ జనంకోసమే పనిచేస్తున్నది అయినా లెక్కల్లో ఎక్కడో మాటిమా
టికీ తేడాలొచ్చి చివరాఖర్లో అంతా అభాసుపాలవడం, అమాత్యుల అద్భుత భావం అల్లరిపాలవడం ..!
మొన్న జరిగిన చదువులపండుగ చివర్లో అధికారులు తయారుచేసిన లెక్కలే అందుకు రుజువు కదా!
నిజమే. జనాభాలెక్కలనుండి గణాంక వివరాల దాకా, ప్లానింగ్ కమిషన్ ఫిగర్లమొదలు బడ్జెటరీ ఎలాట్ మెంట్ల వరకూ... ఎప్పుడూ ఏవో తికమకలు.. తిర కాసులూ... సర్కసులూ చేస్తుంటారీ సర్కారీ దాసులు !
ఈ కంప్యూటర్లొచ్చింది మొదలు మేటర్లో మరీ కనప్యూజన్ పాలువ మరీ ఎక్కువపోయింది . ఎమ్సెట్ పేపర్చూ.. ఎలక్ట్రిసిటీ మంత్లీ బిల్సూ , విద్యార్థుల మార్కుల షీట్లూ, స్టాక్ మార్కెట్ల గత్తర కోట్లు, గెజిట్లు చూపే డేటా షీట్లు గట్రా గట్రా లన్నింటిలో ఎప్పుడూ ఏవో పొరపాట్లు!
ఇదేమని అడిగితే ఏదో పైపై సంజాయిషీలిచ్చే అలవాట్లూ ..
సో.. పట్టించుకొనే నాధుడెవడూ లేడు కాబట్టి . . సూపర్ స్టార్స్ సినిమా రిలీజ్ డేట్స్ , క్రికెట్ ప్లేయర్స్ ట్రాక్ రికార్డ్సూ , ప్రజా ప్రతినిధుల ప్రెస్సు మీట్లు లాంటి వాటిల్లో ఆ తేడాలొస్తే మాత్రం చాలా గొడవలు అయిపోతాయ్!
గెజిట్లో డేటాఫ్ బర్తంటే గుర్తుకొచ్చింది. మొన్నామధ్య ఒక పెద్దాయన పుట్టిన కంగారులో మైమరుపొచ్చేసి మూడేళ్లు ముందు పుట్టినట్లు అరవై ఏళ్లకు గుర్తొచ్చిందట! చటుక్కున చాటుగా సరిచేయించేసుకున్నా అతగాడి సిన్సియారిటీకి బొత్తిగా పిటీ లేకపాయ! చేసిన తప్పు చెబితే చెల్లన్నా వినకుండా పై అధికారులు పాపం ' వల్లకాదు, బ్రెటకు వెళ్లాలన్నా ' రు ! పాపం, కొంతమందికి కన్నీళ్ళు కూడా ఆగలేదంటున్నారు.
పిటీ. . పిటీ అంటూ ననువు మాటిమాటికీ నా మాటల ట్రాకును మళ్లించేస్తున్నావ్!
సారీ గురూ! సావాసదోషం.. సరే .. నీ తిప్పడి కథనే కంటిన్యూ చేసెయ్ !
అక్కడికే వస్తున్నా! సూటిగా చెబితే నీ బోటాడికి మేటర్ బొత్తిగా బుర్రకెక్కదు. కాబట్టి ఈ తప్పొప్పుల పట్క్ టి చదవక తప్పింది కాదు.
ఓకే! కానియ్!
పేపర్లో చూశా... మన ముంబయ్ లో డబ్బావాలాల ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా ' సిగ్మా సిక్స్' స్టాండర్డ్ సాధించారు.
సిగ్మా సిక్స్ అంటే?
పది లక్షల పనులుచేస్తే అందులో కేవలం మూడు తప్పులు మాత్రమే ఉండటం! ... వీళ్ళు చేసే కోటిన్నర పనుల్లో ఒక్క తప్పు మాత్రమే.. అదీ ఏ ఏడాదికో ఒకసారి పొరపాటున దొర్లుతుందని ఇంటర్నేషనల్ మేగ్జైనోటి సర్వేచేసి మరీ సర్టిఫికేటిచ్చేసింది . చదువూ సంధ్యా లేనోళ్ళు. ఒక గుంపుగా తయారై.. కంప్యూటర్లకు మించి కరెక్టుగా లక్షలాది భోజనాల కారియర్లను వందల కొద్దీ కిలోమీటర్ల వరకు .. సిటీ శివార్లు టు సెంట్రల్ పాయింట్ వరకు . . రిటన్లో సాయంత్రానికి ఎవరి ఇళ్లకు వారి బాక్సులు పర్ ఫెక్టుగా చేరేస్తుంటారు!
చదువూ సంధ్యా లేని మనుషులూ....
లెక్కా డొక్కా రాని వాళ్ళు కూడా లెక్కా పత్రం కరెక్టుగా ఎట్లా చేస్తారన్నదే కదా.. నీ ముక్కులూ .. మూలుగుళ్లు !
ఒకే. . ఒకే! పోనీ మనమూ ఆ పొరుగు స్టేటు నుండి కొద్ది మంది బుద్ధిమంతులను అరువుతెచ్చుకుంటే నో!
మన రాష్ట్రంలో కూడా అంతకుమించిన టేలెంటున్నవాళ్ళు పూరికి పదిమందికి తక్కువుండరు. . తెలుసా? ఉదాహరణకి మావూరి తిప్పడినే తీసుకొందాం . పూరు మొత్తానికి వాళ్ళ
దుస్తులు ఉతికే ఫేమిలీ. వాళ్లాకీ ఒకటంటే ఒకటే డాంకీ . రెండొందల గడప. గడపొకటికి కనీసం అయిదు బట్టలేసినా అటూ ఇటూగా వెయ్యవుతాయి. ఈ నెయ్యిలో మళ్ళీ కొన్నొందల వెరైటీలు, చీరెలు, జాకెట్లు, ధోవతులు, పంచెలూ పై పంచెలూ
చొక్కాలూ, పొంట్లూ . . తోళ్లూ తొక్కలూ .. చిరిగినవీ,రంగులు వెలిసి పోయేవీ, చలువ చేసేవీ, చెయ్యనివి, చెయ్యకూడనివీ .. అన్నీ ఒకే మూటలా కట్టుకుని రేవు ఉతుకులు అయి ఆరిందాకా ఆగి .. తిరిగి చీకట్లోగా వాకిట్లోకి చేర్చే డ్యూటీ! ఎవరి బట్టలు వాళ్ల ఇళ్లకు వేళ లోపల తడబడకుండా, తప్పులు ల్లేకుండా , ఏళ్ళ తరబడి చేరవేస్తున్నాడంటే. ' నిజానికి మా తిప్పడి వాషింగ్ ఫేమిలీ ఆపరేషన్ ముందు ఈ సిగ్మా " నగ్మా ..
సిగ్గా... ఐనా సరే సిగ్గుతో తలొంచుకొవాల్సిందే!
చదువు సంధ్యలేకుండా, లెక్కా, డొక్కా, రాకుండా...ఇంత చక్కగా ఎలా పనిచేస్తున్నాడో...? పోనీ రాడి ఆపరేషన్ సక్సెస్ సీక్రెటేమిటొ ఆరాతీసి మన సియంగారి చెవిలో ఊదాల్సింది! సర్కారీ ఉద్యోగుల కాకి లెక్కలతో పబ్లిగ్గా పరువన్నా పోయే ప్రమాదం తప్పుతుంది !
ఆ అయిడితోనే మొన్న మా మారెళ్లినప్పుడు వాడిని కలిసా!
' నీ ట్రేడ్ సీక్రైటేంటో చెప్పరా ! ' అని గట్టిగా వత్తిడి చేస్తే ఏమన్నాడో తెలుసా?
ఏమన్నాడ్రా?
ఇందులో నాగొప్పేంలేదయ్యా! గొప్పంతా మా గాడిదదే! గుడ్డల మూట వాసన బట్టి గడపగడపకి తిరుగుతుందది, దానితోకపట్టుబతిరగటమే మేము చేసేపని' అనేశాడు.
'ఈ లెక్కన గాడిదే చాలా గ్రేట్!
అవును ' అందుకే స్పెషల్ రిక్రూట్ మెంటు పెట్టి కనీసం వాటిలోని కొన్నింటినయినా మన గవర్నమెంటు పన్లోకి తీసుకుంటే మన సియం తన సెంచరీ విజన్ లో కనీసం సెంటిమీటర్ సక్సెస్ కన్నా నాందీ పలకవచ్చు!
- కర్లపాలెం హనుమంతరావు'
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )
No comments:
Post a Comment