Monday, December 27, 2021

కవిత : కానుక

కవిత : 


కానుక


( తోటి ఖైదీ, బెల్జియన్ మిత్రుడు ఆండ్రీ కోసం)

రెండవ ప్రపం యుద్ధంలో పాల్గొని మరణించిన రష్యన్ ఫ్రంట్ లైన్ కవులలో మస్సాజలీల్ ముఖ్యుడు. నాజీలు ఇతన్ని 1944లో ఉరితీశారు. నిర్బంధంలో ఉండగా జలీల్ మంచి కవిత్వం రాశాడు. అందులో ఒకటి: 


మాతృభూమిలో

జీవితం తియ్యగా ఉన్న రోజుల్లో

పువ్వుల మధ్య గడిపిన ఆ సమయాల్ని 

మళ్ళీ వెనక్కు తీసుకు రాలేను నేస్తం 

ఆ ఆనందమూ లేదు.


ఇక్కడ తోటలూ లేవు ఇళ్ళూ లేవు

స్వేచ్ఛ అసలే లేదు

ఇక్కడ 

పువ్వులు కూడా వేగంగా వాడిపోతుంది  

ఇక్కడ నేల కూడా నిర్బంధంలో మూలుగుతోంది


కానీ

నా చైతన్యం మాత్రం

సత్యంలా స్వచ్ఛంగా 

పరిశుభ్రంగానే ఉంది 

అందుకే

 నా హృదయంలో వికసిస్తున్న పాటల్ని

నీకు కానుకగా ఇవ్వనీ 

వాటికి మరణం లేదు

అవి చెరసాలలో 

ఈ ఆత్మ పూస్తున్న చెలిమి పువ్వుల్ని 

నా మాతృదేశానికి తప్పక అందిస్తాయి.


రష్యన్ కవిత : మస్సాజలీల్ 

అనువాదం : కొప్పర్తి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...