ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
బెక బెక రాజకీయం
రచన - కర్లపాలెంహనుమంతరావు
( ప్రచురితం - 12 - 03-2014 )
'కప్పుల బెకబెకలు మరీ ఎక్కువైపోతున్నాయి. రాత్రుళ్లే కాదు. పగలూ నిద్రపట్టడం లేదు ఈ కప్పుల గోలకు' '
అకాల వర్షాలు కదన్నా! కప్పల సందడి ఆ మాత్రమన్నా ఉండదా?
ఆ కప్పులు కాదురా వెంగళప్పా నా గోల ! ఈ రాజకీయ గోదురు కప్పుల గురించిరా బాబూ! ఇప్పటిదాకా ఏ రాళ్ల కడుపుల్లో వెచ్చగా బబ్బున్నాయోగానీ, నాలుగు చినుకులు పడేసరికి బొబ్బలు మొదలు పెడుతున్నాయి.
వానలన్నాక కప్పలు, ఎన్నికలన్నాక రాజకీయ కప్పలు సహజమే కదన్నా! కాకపోతే లోపల ' కాక ' మరీ ఎక్కువైనట్లుంది . ఈసారి ఎప్పటికన్నా కాస్త ఎక్కువగా బయటపడుతున్నాయి.
కొత్త కప్పలు కూడా ఎక్కడెక్కడినుంచో పుట్టుకొస్తున్నాయప్పా ! అంతంత గొంతులేసుకుని గంతులేస్తున్నాయి. గోకప్పల్ని మించి ముదిరిపోతున్నాయి. దురు
ఇప్పట్నుంచే కప్పల్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముం చెప్పన్నా! కప్పల్ని కన్నా ఆకాల వర్షాల్ని అనాలి గాని! నిన్నమొన్నటి దాకా ఎక్కడా ఒక్క వాన చుక్క కనిపించలేదు. గంగానమ్మ జాతర్ల నుంచి గాడిదల జంటలకు పెళ్ళిళ్ల దాకా దేన్నీ వదిలిపెట్టింది లేదు కాదా మనవాళ్లు! అందుకేనేమో చాలా కాలం తరువాత వానలు దంచి కొడుతున్నాయి .
వట్టి వానలైతే ఫర్వాలేదురా అబ్బీ ఒకవంక ప్రాణాలు తీసే వడగళ్లతోపాటు కప్పుల గోలా మాలావుగా ఉంది . మరోవంక ఎన్నికల మీద ఎన్ని కలు జనాలు నెత్తిన పిడుగుల్లా వచ్చి పడి కష్టం రెట్టింపైంది. ఎన్నికలనేవి అసలు లేకుండా పోయుంటే, ఈ రాజకీయ కప్పుల వంగుళ్లు దూకుళ్ల గోలన్నా తప్పిఉండేది కదా!
ఉగ్రవాదుల మాదిరిగా వాదిస్తున్నావేందన్నా! ఎన్నికలు ఉండబట్టే గదా మనలాంటి ఓడమల్లయ్యలున్నా రని పెద్దమనుషులకు తెలిసొచ్చేది! .నియంతృత్వం మీదకానీ మోజు పెరుగుతోందా ఏంది నీకు!
అక్కడికి ఇప్పుడు నడుస్తున్నదంతా పెద్ద ప్రజాస్వా మ్యమే అయినట్లు! నాకు తెలీక అడుగుతా, రెండింటికీ తేడా ఎక్కడుందిరా? ఓట్టేసి అనక నోర్మూసుకుని ఉంటాం. నియంతృత్వంలో. నియంతల పాలనలో ఆ ఓట్ల పాట్లూ ఉండవు అంతే!
సే భాషలో నువ్వేం చెప్పినా, ఎన్నికలనేవి ఉండబట్టే మనకు ఈ మాత్రమైనా మంచి జరుగుతోంది. నగదు బదిలీ రోగం వదిలిందా ! వంటగ్యాస్ సిలిండర్లు మళ్ళీ గతంలోలా పన్నెండు వరకూ దిగిందా! చిల్లర వ్యాపా రాలు చేసుకునేవాళ్లకు పోలీసు మార్కు సత్కారాలు తప్పుతు
న్నాయా! కోరలున్నా లేకపోయినా లోక్ పాలు బిల్లంటూ ఓటి ముందుకు కదిలిందా! ఎన్నికలే లేకుంటే ఈ మాత్రమైనా జనం గురించి ఆలోచించేవాళ్లీ గద్దెల మీది పెద్ద ప్రభువులు?
ఎన్నికలపై నాకూ తప్పుడు అభిప్రాయమేమీ లేదురా అబ్బీ! జరుగుతున్న తంతు గురించే నా దిగులంతా ! ఎన్నికలనేసరికి ఎక్కడలేని హడావుడి .. హంగామా! వేడివేడి పెసరట్టులాగా ఉదయాన్నే వార్తలొచ్చేస్తాయి. ఈ అల్పాహారం రుచికి అలవాటు ఓటరు పౌష్టికాహారం పూర్తిగా పక్కన పెట్టేస్తాడన్నదే నా బాధ. అభివృద్ధి గురించి గానీ, నిలబెట్టుకోవాల్సిన సంపద గురించి గానీ ఎక్కడైనా ఒక్క చక్కని చర్చ జరుగుతోందా? ఎన్నికలకు వందరోజుల ముందు మాత్రం విరుగుడు మంత్రంగా మందులేస్తే ఈ దేశానికి పట్టిన పెద్దరోగం నయమవుతుందా? మాయదారి రాజకీయాల మూలంగా కాదూ, మనం వద్దని ఎంత మొత్తుకున్నా విదేశాల తుక్కు అణుపరిశ్రమలు మన నెత్తిమీదకు వచ్చి పడింది! మనదగ్గరే వీధికొక చిల్లర దుకాణం చల్లగా వ్యాపారం చేసుకుంటున్నా ఏం ఉద్ధరించాలని బలవంతంగా పరాయిగడ్డ దుకాణాలను రుద్దబోయింది। వద్దన్న చోట సెజ్జులు! కావాలన్నా ఇవ్వరు పరిశ్రమలు ! జనం మాట నిదానంగా ఆలకించి ఆచరించిన పాపాన పోయారా మనం ఓట్లేసి గెలిపించిన నేతలు?
ప్రజాస్వామ్యం అంటే అదేదో పచ్చి కాకరకాయ చేదు అన్నంత వితండంగా వాదిస్తున్నావేందన్నా? ఎప్పుడో ఒకప్పుడన్నా ఎన్నికలొచ్చి పోయే సదుపాయం చిన్నదా.. చిత కదా ? ఉత్తప్పుడు ఎంత చెల, రాజకీయాలకు పాల్పడ్డా , కనీసం ఎన్నికల ముందైనా అంత రాత్మ అంటూ ఒకటి ఏడ్చిందని, , దానికీ అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంటుందని, తగిన గుర్తింపు ఇవ్వకుంటే మొత్తం రాజకీయాలని తారుమారు చేసేస్తుందని తెలుస్తుంది గదా! ప్రభుత్వాలని నడపటం ఎలా, సామాన్యుడి జీవితాన్ని గాడిలో పెట్టడం ఎలా అని ఊరికే ఇంట్లో ఓ మూల కూర్చుని కాగితాలు నలుపు చేసుకునే మేధావులకూ చిన్నదో చితకదో ఒక పార్టీ అంటూ పెట్టుకునే గొప్ప తరుణం ఎన్నికలంటూ ఉండబట్టేగదా వచ్చేదీ!
అవును . నిజమే పాత పార్టీల్లోంచి కొత్త పార్టీలు పుటుకొస్తున్నాయి. ఆ కొత్త పార్టీల్లో కొన్ని చీలి, మళ్ళీ పాత పార్టీలో కలుస్తున్నాయి. అవి ఇవి కలకలిసిపోయి, చివరకు కొత్తపార్టీ ఏదో, పాత పార్టీ ఏదో అర్ధమవకుండా పోతుంది . ఇందులోనివారు అందులోకి.. . అందు లోనివారు ఇందులోకి దూకుతున్నారు. వారూ వీరూ ఉమ్మడిగా ఇంకెందులోకో గెంతుతున్నారు. ఈ దూకపళ్ళు చూసి, కప్పరే తమ స్పెప్పులు మరచిపోయేట్టున్నాయి.
ఆగన్నా ఆగు... నాకు తల తిరిగిపోతోంది.
ఈ ఒక్క నాలుగు ముక్కలకే నీకు ఇలా తలా మొలా తిరిగిపోతుంటే, మరి మామూలు మనిషికి ఇంకెంతలా తిరిగిపోవాల్రా... ఆలోచించు! ధరల పెరుగుదల జోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పెట్రోలు బంకుల్లో, బ్యాంకుల్లో బయటపడుతున్న మోసాలు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవైతే కావు. ఇవాల్టి కివాళ ఆగిపోయేవీ కావు.. విద్యుత్ కోతల సమయం రెట్టింపైంది. ఉద్యోగాలు ఉపాధులు ప్రకటనలకే పరిమితం. వాస్తవంగా ఒక్కటన్నా వచ్చి ఒరగబెట్టిందేమీ లేదు. చదువులు సాగటం లేదు . సరిగ్గా ప్రైవేటు బస్సులు, బళ్లు జనాల మీదపడి చేసే నిలువుదోపిడికి అడ్డూ ఆపూ లేదు. సైనికుల వాహనాల నుంచి జనతాకు పంచే చిల్లర సరకుల సంచుల దాకా కుంభకోణాలు. అయినా, ఆ అక్రమార్కులే మళ్ళీ జనం మధ్యకు వచ్చి వాహనాలపై నిలబడి నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచేస్తారు. . జనాలు చప్పట్లు బాదేస్తారు . ఓట్లు రాబట్టుకోవడానికేనా ఎన్నికలు?
కప్పదాట్లన్నీ ఓట్లకు సీట్లకు కాకపోతే.. మరెందుకన్నా!
రచన - కర్లపాలెంహనుమంతరావు
( ప్రచురితం - 12 - 03-2014 )
No comments:
Post a Comment