ఆధునిక
మారీచులు
-కర్లపాలెం
హనుమంతరావు
‘ర-
కారం ముందుడే అక్షరాలన్నీ నన్ను భయకంపితుణ్ణి చేస్తున్నాయిప్పడు. రత్నాలు, రథాలు.. అయినా సరే భయమే భయం! శూర్పణఖ
కారణంగా నీకు రాముడు మీద కొత్తగా పగ పుట్టుకొచ్చింది. తన కారణంగానే నా తోబుట్టువు ఖరుడు
చచ్చినమాట గుర్తుతెచ్చుకో రాజా! రాముడు రాక్షస జాతి మొత్తానికి అంతకుడు. అందులో
పిసరంతైనా అనుమానం లేదు. వాడి దెబ్బ రుచిచూసిన వాడిని కాబట్టే నిన్ను ఇంతగా హెచ్చరిండం. అప్రమత్తంగా ఉండు. లేకపోని కక్షలతో నువ్వే కాదు
నీ బంధు కోటి సర్వం భూమ్మీద లేకుండా చేసుకోకు!’ అంటూ మారీచుడు మంచి మాటలు నాలుగు చెప్పబోయినా
రావణాసురుడి చెవికి ఎక్కాయి కాదు! చావు మూడినవాడు ప్రాణౌషధాన్నీ దగ్గరకు
రానివ్వడు! మారీచుడీ మాటలు చెవినపెట్టకుంటే పాయ, వెటకారాలకు దిగాడు సహాయం అడుక్కోడానికి
వచ్చిన రావణబ్రహ్మ.
‘ఈ
అయుక్తార్థాలు ఎప్పట్నుంచి మారీచా? ఊసర క్షేత్రంలో
విత్తులా నీ మాటలు నా మనసువులో నాటవు. ఇహ పండే మాట ఎక్కడ? అయినా, పాపశీలుడు, మూర్ఖుడు పైపెచ్చు
తుఛ్చ మానవ జాతికి చెందిన రాముడితో నేరుగా తలపడ్డం నా స్థాయికి తలవంపులు. కాబట్టే నిన్నిట్లా
దేబిరించడం. అయినా ఆడదాని మాట కోసం మిత్రుల్ని,
తల్లిదండ్రుల్ని గాలికొదిలి మన ఆడవుల్లొ కొచ్చి పడ్డ ఆ ధూర్తుడి మీదనా ఈ స్తోత్రాలు, దందకాలు? నీ సోదరుడి
చావుతో ఆవరించిన నైరాశ్యం వల్లనుకుంటా పిరికితనం. ఎంత హాస్యాస్పదం! స్వంత ప్రాణాలకన్నా
కట్టుకున్న ఆడదాని మానం ముఖ్యం ముఖ్యమనుకునే
అనాగరికుఏమిటి.. విడ్డూరం కాకపోతే!
ఇదిగో మారీచా! ఒక మాట చెబుతున్నా.. సావధానం వినుకో! సీతాపహరణం జరిగి తీరుతుంది. అదీ
నీ సమక్షంలోనే. ఇంద్రాది దేవతలు ఆడ్డొచ్చినా
ఆగే కార్యం కాదిది. మంచీ చెడూ చెప్పడానికి నీకున్న అర్హత నీకుంటే ఉండొచ్చు!
నీ పని నీవు చేసేశావు. ఇహ నా పని మొదలయ్యే మార్గం మాత్రమే చర్చించడం నీ విధి.’ అని హూంకరించాడు రావణాసురుడు.
తెలివైన
దాసుడు రాజు దగ్గర మొండికి తిరగడం చావు స్వయంగా కొనితెచ్చుకోవడమే! రాజుకు రుచించని
పక్షంలో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి మాటయినా సరే తలబిరుసుగా చెబితే మొదటికే బెడిసికొడుతుంది. మారీచుడి దుస్థితే
ప్రస్తుతం ఏ.పి ప్రభుత్వంలోని అధికారుల సంకట స్థితి.
‘పంచ రూపాణి రాజానో ధారయంతి అమిత ఓజసః | అగ్నేః ఇంద్రస్య సోమస్య యమస్య వరుణస్య చ / ఔష్ణ్యం
తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతాం |ధారయంతి మహాతామ్నో
రాజానః క్షణదాచర /తస్మాత్ సర్వాసు అవస్థాసు మాన్యాః పూజ్యాః చ పార్థివాః /త్వం తు
ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహం ఆశ్రితః ‘
రాజు
అంటే అగ్మి, ఇంద్రుడు, చంద్రుడు,
వరుణుడు, యముడు.. ఈ ఐదు రూపాలు కలగలుపు. కాబట్టే అతగాడిలో ఉష్ణం,
వీరత్వం, సౌమ్యత, ప్రసాద
లక్షణం, దండించే గుణం- సందర్భాలను బట్టి ప్రసారమవుతాయి. రాజులు
అన్ని వేళలా పూజనీయులు అవడానికి అదే కారణం. నువ్వు ఆ ధర్మం తెలిసీ అతిక్రమించి మాట్లాడావు.
నీలోని మోహమే అందుకు ప్రధాన కారణం.’ అభ్యర్థించడానికి వచ్చానన్న చులకనా? రాజుతో పరుషంగా మాట్లాడడం తగని పని.
సరే, ఈ దఫాకు మనసులో ఉంచుకోకుండా నీ తప్పును క్షమించేస్తున్నా.
బంగారు లేడిగా మారు. వంటి మీద వెండి మచ్చలుండాలి. అడవిలో రామాశ్రమం చుట్టూతా తచ్చాడుతుండు.
సీత కంటబడ్డం ప్రధానం. ఆడవాళ్లకు బంగారం మీదుండే కాంక్ష నార బట్టల సీతనైనా కుదురుగా
ఉండనీయదు. పెళ్లాం కోరింది కాదనకూడదనే పనికిమాలిన జాతి పురుషుడు రాముడు. నీ వెంట పడకతప్పదు.
నువ్వు ఆ మూర్ఖుణ్ణి ఆశ్రమానికి చాలా దూరం
తీసుకు వెళ్ళు చాలు. ఆనక సందు చూసుకుని 'హాసీతే లక్ష్మణే త్యేవం
రామ వాక్యనురూపకం' అని అరుపుల్లంకించుకో మారీచా! సీత ప్రచోదనం
వల్ల లక్ష్మణుడికీ రాముడు వెళ్ళిన దారి వెంటనే వెతుక్కుంటూ పోకతప్పదు. ఇంద్రుడు శచీదేవిని
త్తుకొచ్చినట్లు ఒంటరి ఆడదానిని ఎత్తుకొచ్చే
ప్రతాపం అప్పుడు నేను చూపిస్తా!ఈ కార్యం చేసి పెట్టినందుకు నీ కష్టం ఊరికే
ఉంచుకోల్, అర్థరాజ్యం ముట్ట చెబుతానని మాట ఇస్తున్నా. ఆ తరువాత నువ్వు దాన్ని ఏలుకుంటావో, ఏట్లో కలుపుకుంటావో .. నీ ఇష్టం' అంటూ రావణాసురుడు
ఇప్పటి మన పాలకులు కొద్దిమందికి మల్లేనే ఊదరగొట్టేస్తాడు.
కైలాసగిరిని
ఎత్తి కుదేసిన ఘనుడై ఉండీ రావణాసురుడు ఒక ఒంటరి మానవ స్త్రీని ఎత్తుకొచ్చేందుకు ఇంత
కథ ఎందుకు నడిపించినట్లు? అంటే ఒకటే సమాధానం! పోయేకాలాన్ని
మరింత ముందుకు తెచ్చుకోడం కోసమే!
పోనీ
ఎత్తుకొచ్చిన సీత ఏమైనా ఆ రాక్షస రాజుకు లొంగి వచ్చిందా? తప్పు చేసిన ఆ తుచ్ఛుడు తుదకు మొదట్లో మారీచుదు చెప్పిన చావుదెబ్బ రుచి చూడనే చూశాడు. అయ్యో పాపం అనాల్సిన
అవసరమేమీ లేదు కానీ, మంచి మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉండీ చెప్పలేక
చివరికి అన్యాయంగా చావు మీదకు తెచుకున్న మారీచుడి గురించే వ్యథంతా!
‘మారీచ వధ’ ఎన్నిసార్లు పారాయణం చేసి ఉంటారో మన
ఏపిలోని అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు! అయినా బుద్ధి రావడం లేదు. ఆధునిక మారీచులను గురించే బాధంతా!
-కర్లపాలెం
హనుమంతరావు
21
-05 -2021
No comments:
Post a Comment