మహాభారతంలో ధర్మరాజు చేసిన సూర్యస్తో త్రములోని ప్రకృతికి సంబంధించిన కొంత భాగం-
( వనపర్వం - 13 వ అధ్యాయం- శ్లో 14-25 )
త్వమాదాయాం శుభి స్తేజో నిదాఘే సర్వదేవానామ్ । సర్వేషధిరసానాం చ పునర్వరాసు ముఖ్చసి।
14
మీరు గ్రీష్మఋతువునందు మీ కిరణములచే సమస్త దేహ ధారుల యొక్క తేజమును సమస్త ఓషధుల యొక్క రసము యొక్క సారమును ఆకర్షించి తిరిగి వర్షాకాలమున దానిని వర్షిం జేయుచున్నారు
తపన్త్యన్యే దేహన్త్యన్యే గర్జన్యన్యే తథా ఘనాః ॥
విద్యోత స్ర్తీ ప్రవర్షన్తి తవ ప్రావృష రశ్మయః ॥
15
వర్ష ఋతువునందు మీ యొక్క కొన్ని కిరణములు తపించుచు కొన్ని మండింపజేయుచు కొన్ని మేఘములై గర్జించుచు కొన్ని మెఱుపులయి మెఱయుచు కొన్ని వర్షించుచు ఉన్నవి.
న తథా సుఖయత్యగ్నిర్న స్రావారా న కమ్బలాః | శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః ॥
10
శీతకాలపు గాలిచే పీడింపబడిన జనులకు మీ కిరణము లెంత సుఖమును కలుగ జేయునో అంత సుఖమును అగ్ని కాని కంబళ్ళు. కాని వస్త్రములుకాని కలుగ చేయజాలవు
త్రయోదశ ద్వీపవతీం గోభిర్భాస యసే మహీమ్ । త్రయాణామఎ లోకానాం హితాయైకః ప్రవర్తనే॥
17
మీరు మీ కిరణములద్వారా పదమూడు ద్వీపములతో కూడిన ఈ భూమిని ప్రకాశింపజేయుచున్నారు మఱి యు ఒంటరిగనే ముల్లోకములకును వాత మొనర్చుచున్నారు
తవ యద్యుదయో న స్యాదగ్ధం జగదిదం భవేత్ |
న చ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్ మనీషిణః ||
18
మీరు ఉదయించనిచో ఈ జగత్తంతయు గ్రుడ్డిది యగును మఱియు విజ్ఞులు ధర్మ అర్థ కామ సంబంధ కర్మములందు ప్రవృ త్తులే కారు
ఆధానపశుబన్ధేష్ణ మ శ్రయజ్ఞ తపః క్రియాః | త్వత్ప్రసాదాదవాప్య ర్తే బ్రహ్మక్షత్ర విశాం గణైః ||
19
అగ్ని స్థావన పశువులను కట్టుట పూజ మంత్రములు యజ్ఞానుష్ఠానము తపస్సు మున్నగు క్రియ లన్నియు మీ యొక్క కృపచేతనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులద్వారా జరుపబడు చున్నవి.
యదహర్ర్బహ్మణః ప్రోక్తం సహస్రయుగ సమ్మితమ్ |
తస్య త్వమాదిర న్తశ్చ కాలక్షైః పరికీర్తితః ॥
20
వెయ్యి యుగములతో గూడిన బ్రహ్మ దేవునియొక్క దిన మేది చెప్పబడినదో కాలమానము నెఱిఁగిన విద్వాంసులు దాని ఆది అంతములు మీరే యని చెప్పుచున్నారు
మనూనాం మరుపుత్రాణాం జగతో మానవస్య చ |
మన్వ స్తరాణాం సర్వేషామీశ్వరాణాం త్వమీశ్వరః ||
21
మనువు యొక్కయు మను పుత్రులయొక్కయు జగత్తు యొక్కయు అమానవునియొక్కయు మన్వంతరము లన్నిటి యొక్క యు ఈశ్వరులయొక్కయు ఈశ్వరుడు మీరే అయి యున్నారు.
సంహారకాలే సమ్ప్రా ప్తే తవ క్రోధ వినిః సృతః |
సంవర్తకాగ్ని స్త్రైలోక్యం భస్మీకత్యావతిష్ఠతే ॥
22
ప్రళయకాల మేతెంచగా మీ వలన ప్రకటనగు సంవర్తక మను అగ్ని మూడు లోకములను భస్మ మొనర్చి తిరిగి మీ యందే స్థితిని పొందుచున్నది
త్వద్దీధితి సముత్పన్నా నానావర్ణా మహాఘనాః ।
సైరావతాః సాశనయః కుర్వన్త్యాభూత సమ్లవమ్ ॥
23
మీ యొక్క కిరణముల చేతనే ఉత్పన్నములగు ఐరావతాది రంగురంగుల మహామేఘములు మెఱపులు సమస్త ప్రాణుల యొక్క సంహారము నొనర్చుచున్నవి.
కృత్వా ద్వాదశధాత్మాZZనం ద్వాదశాదిత్యతాం గతః | సంహృత్యై కార్జనం సర్వం త్వం శోషయసి రశ్మిభిః ||
24
పిదప మీరే మిమ్ములను పండ్రెండు స్వరూపములుగ విభ జించుకొని పండ్రెండుగురు సూర్యుల రూపమున ఉదయించి మీ కిరణములద్వారా ముల్లోకములను సంహార మొనర్చుచు ఏకార్ణ వము యొక్క జలమునంతను శోషింప చేయుచున్నారు.
త్వామిన్ద్రమాహు స్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః | త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతమ్ ||
25
మిమ్ములనే ఇంద్రుడని చెప్పుచున్నారు మీరే రుద్రుడు మీరే విష్ణువు మీరే ప్రజాపతి అగ్ని సూక్ష్మమనస్సు ప్రభువు సనాతన బ్రహ్మము మీరే అయి యున్నారు
- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
01 - 12 - 2021
మాతృక : భారతరత్నాకరము
No comments:
Post a Comment