ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం
జంతులోకం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 07 - 11 - 2002
మేన్ ఈజ్ ఎ సోషల్ ఏనిమల్..
దానికి మనమేం చేస్తాం!' అంది కోతి గంభీరంగా
అక్కడికి మనమంతా సైన్సు జంతువులు మైనట్లు! - అంది నక్క ఎకసెక్కెంగా .
జోకులొద్దు! మేటర్ సీరియస్. మాటి మాటికి మాటమాటకు మనిషి మనతో కంపేరెందుకు చేసుకొంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవరైనా కొద్దిగా బుద్ధి తక్కువ పన్పేస్తే చాలు గాడిద కొడకా అని తిడతాడే! గాడిదలకు మెదడు అంతతక్కువ ని అతగాడి ఉద్దేశమా?' అంది గార్దభం కోపంగా .
మనిషికెవరైనా సరే సరిపడక పోతే తెగబడి తిడతాడు. కొండవీటి చాంతాడంత కవిత్వాలు రాస్తున్నాడని కాబోలు . . వాడలవాడలందిరిగి వచ్చెరువారలు గోడల గొందులొందొదిగి కూయుచుంచెడువారినలా గాడిదలతో పోల్చాడూ! గాడిదకైతే మాత్రం కైతలు రాకూడదని - రూలుందా ? అనింకా ఎక్కించింది నక్క .
వీడా నాకొడుకని.. కందంలో అంతందంగా ఏడ్చింది గాడిద .
గాడిదవి కనక కాస్తోకూస్తో నీకూ కవిత్వాలొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసిందీ పాపం. మొన్న తొగాడియా అనే పెద్దమనిషంతలా తెగబడి ఎగస్వార్టీ వాళ్లనలా వూరకుక్కలు. బోరకుక్కలు సీమకుక్కలని తిట్టిపోయడాలు!
అట్లాగే మా పేర్లు పెట్టి ముట్టె పొగరని - మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అంది పంది కూడా బాధగా.
దున్నపోతులాగా మాచేత పనిచేయించుకుంటూ ఒళ్లొంగని వాళ్లను మళ్లీ దున్నపోతులని దులిపేస్తాడదేందో - ఆవేదనగా అంది దున్నపోతు.
' అందరు అందరే మరియు సందరునంద రేయందరందరే ' అని సభలోని వాళ్లందర్నీ కలగలిపి కుక్కలూ, కోతులూ, పందులూ, దున్నలను ఒక కవిగారు కలగలపి తిట్టిపో యటం గుర్తుకొచ్చి గట్టిగా నిట్టూర్చుకొన్నాయి. అభయారణ్యంలో సభ తీరిన ఆ జంతువులన్నీ
మనవాడి తీరే అంత ! మన మనవడని చెప్పుకోటానికే సిగ్గేస్తోంది 'అంది పాతతరం కోతోకటి ని పక్క కోతితో.
'పెద్ద.. దేవుడు వాడికొక్క డికే పెద్ద బుర్రిచ్చాడని పొగరేమో! వెళ్లి దేవుణ్ణే అడుగుదాం పదండి - అంది జంబూకం .
చెయ్యాల్సిన నక్క జిత్తులన్నీ తానే చేస్తూ ' జిత్తులకు జాకాల్ ' అని తన నేమ్ బద్నామ్ చేస్తున్నాడని నక్క అక్కసు.
సమావేశం సమరావేశం చూసి గాడ్ కూడా గాఢంగా నిట్టూర్చాడు. మడిసి మిడిసిపాటు తనకూ కొత్తకాదు . ఒళ్లుమండినప్పుడు తననూ విడిచిపెట్టింది లేదు. ' తిరిపమాని కిద్దరాండ్రా పరమేశా .. గంగ విడుము. పార్వతిచాలున్!' అనటం గుర్తొచ్చింది. ఇంటి ఆడవాళ్ల జోలికొస్తే ఎవరికైనా కాలిపోతుంది,
అయినా దేవుడి రోల్ లో ఉన్నాడు. సర్దిచెప్పడం తన డ్యూటీ. కనక విషయమంతా విని తొగాడియా మహాశయుడు తెగనాడేటప్పుడు గాడితప్పటంలో మహా ప్రవీణుడు లే.
పాలిటిక్సు అన్నాన్ ఇలాంటి హాట్ హాట్ కామెంట్లు ఎప్పు ఉన్నా తప్పవులే. ఎన్నికలంటేనే పోలింగు బూతులు , న
' బూతో' న భవిష్యత్తని నమ్మే సజ్జు రాయల్టీ రోజురోజుకూ ఎక్కువౌతోంది. కాబట్టే నరుల నాలికలకిలా నరాలు తెగిపో న్నాయి. అశ్లీలమే వాళ్లసలైన శీలమై యింది. అట్లాంటివాళ్ల తిట్లనాట్టే పట్టించు కొంటే మీకు నిద్ర పట్టదు. థూ అని ఓ సారి ఉసేసుకుని మీ పని మీరు చేసుకోవాలి! అన్నాడు కోవాలన్నాడు దేవుడు.
వాళ్ల లో వాళ్లు ఒకళ్లనొకళ్లు మెంటల్ .. శుంఠలనో ఎంత అన్ ప్రింటబుల్ తిట్టుకొ ఫరవాలేదు .. కానీ, మహాప్రభో! ఈ కుక్కలనీ, పందులనీ గోలేంది. భాష మహా వల్గరావుంది... ఈ వానర వారసుల వరస చూస్తే మీరింకా అవతారమెత్తాల్సిన అవసరముంది - అంటూ జంతు తంతు సర్వం గొంతెత్తి ఘోష పెట్టాయి .
సరే! ముందసలు సందర్భమేంటో క్కుందాం ! మానవుడి వాదనా విందాం! వాడిని 'రమ్మ'ని కాకిచేత కబురంపించాడు దేవుడు.
ఎన్నికల హడావుడి. ఎక్కడి టైము పాదయాత్రలకే చాలటంలేదు. చిలకను పంపిస్తున్నా.. చర్చించుకోండి న అన్నాడు మనిషి .
చిలక మనిషి పలుకుయి చెప్పడం మొదలు పెట్టింది.- కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే. డిఓజి డాగ్.. డాగన్న తిరగేసిన గాడే .. జిఓడి నే గదా! కనకనే దాన్ని కాల భైరవుడుగా కొలుస్తుంటాం. గ్రామ సింహమని గౌరవిస్తుంటాం . ధర్మరాజు తమ్ముళ్లందర్నీ వదిలేసి ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి అందుకేగా తీసుకెళ్లిందీ! కుక్క పిల్లా.. అగ్గిపుల్లలాగా కాదు మా కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువ చేసి చూసిందిలేదు. పాము మాకు పాకే దేవుడు. దశావతారాల్లో జంతువులకెన్నింటికో దేవుడి హోదా కల్పించామా.. లేదా ? ! గాడిది అయినా ' గాడ్, ది గ్రేట్' తో సమానమే గదా ! పేపర్ల వాళ్లు ఉపన్యాసాలు పూర్తిగా విన కుండా మిస్ రిపోర్టింగ్ చేస్తే మాదా తప్పు ? ఇన్ని నిజాలు చెప్పిన తరువాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ ఇష్టం-
చిలకద్వారా విన్న మనిషి పలుకులకు పాము ఫ్లాటయిపో యింది. మనిషినపార్థం చేసుకున్నందుకు గార్దభం బాధపడింది. మొసలి కూడా కన్నీరు కార్చింది .
కాని నక్కే.. ఈ మనిషి జిత్తులు నాకు కొత్త కాదు. మనిషిని పనిష్ చేయాల్సిందే!' అని వాదనకు దిగింది.
ఉడుముది కూడా అదే పట్టు.
మనిషితో మాది రక్తసంబంధం.. మాటపోతుంద' ని దోమ తెలివిగా తప్పు కుంది.
మనిషి వదిలే మురుగు లేనిదే మాకు మనుగడ లేదు. నరుడే మా గురుడు - అని ఈగలూ నల్లులూ... పేలూలాంటి కీటకాలా ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
కోడికి మాత్రం చాలా కోపంగా ఉంది. నేను కూయటం మానేస్తాను. ఘడియ ఘడి యక కూయించుకుని ఆకలేసినప్పుడు వేయించుకు తింటాడు- అందికోడి.
బోడి కోడి లేక పోతే తెల్లవారదా ఏందీ? మాకు బోలెడన్ని గడియారాలున్నాయి అంది చిలుక మనిషి తరపునుంచి,
నేనూ దున్నటం మానేస్తాను. తిండిగింజలు లేక ఛస్తాడ'
ని కాడి కింద పడేసింది దున్నపోతు.
నీ సాయం లేకపోతే వ్యవ సాయం ఆగదులే ! మిషన్లతో పన్లు నిమి షాల్లో అయిపోతాయి అంది మళ్లీ చిలక.
అడవి నడివికి చీలిపోయింది .
గోవులూ, గుర్రాలూ, చిలకలూ, ఎలు కలూ, నెమళ్లూ, లేళ్లూ లాంటివొకవైపు . కాకి , నక్క, గద్ద , గబ్బిలం లాంటివింకోవైపు.
పులులూ, గొరిల్లాలు చర్చల్ని బహిష్కరిం చాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ- అని కూడా ప్రకటించేశాయి.
కప్ప గంటకో వైపు గెంతుతోంది.
గోడమీదున్న పిల్లికి ఎటు దూకాలో పాలుపోలేదు.
కుక్క ఒక్క ముక్క మాట్లాడితే ఒట్టు. అరిచే కుక్క కరవదని కదా సామెత !
ఎన్నికల నుకున్నాయి.
మనిషి నీ మాస్టర్... మాకే నీ ఓటంటూ చిలక మనిషి పార్టీ ఒకవైపు... '
మాస్టర్ కాదు. వాడొట్టి వరస్ట్! మాకే నీ ఓటు అంటు నక్క పార్టీ ఊళ ఇంకో వైపు .
ఒక్క కుక్క ఓటుమీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితి వచ్చిపడిందిప్పుడు . అందుకే అంటారు ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుందని.
పోలింగ్ ముగిసింది.
ఒక్క ఓటు మెజా ర్టీతో మనిషి ఘనవిజయం సాధించాడు మనిషి !
ధరావత్తు కూడా దక్కదనుకున్న మనిషి విజేత అయ్యాడు. అదెలా సాధ్యం?
ఫలితాలపై సమీక్షకోసమని జంతులోకం మళ్లీ సభతీరింది, అన్నింటి అనుమానం కుక్క విశ్వాసఘాతుకం మీదనే
ఛీ... కుక్కబుద్ధి.. కనకపు సింహాసన మ్మీద కూర్చోబెడతామన్నారని హామీ ఇచ్చాడు కాబోలు! వెనకటి బుద్ధి పోనిచ్చుకుందికాదు. తొగాడియాలాంటి వాళ్లు ' ఛీ! కుక్కా! ' అని వూరికే తిడతారా ? అని చీదరించు కొంది కాకి అండ్ కాకి గ్రూప్.
లోకులు పలుగాకులు.
' శునకం ఓటు ఎలాగూ మనిషికేనని నేనూ అను కున్నాను . నా ఓటు వృథా అవడం ఎందుకని నేనూ ఓటు మనిషికే వేశాను - అని మధనపడింది మళ్లీ గోడెక్కిన పిల్లి .
'నువ్వటు దూకటం చూసి .. నేనూ అటే గెంతేశాను. . ఆఖరి నిమిషంలో' అంది కప్ప పిల్లితో గుడ్లు తిప్పుతూ .
'ఏదైతేనేం. మనిషి గెలిచాడు! సంధి చేసుకుంటే మీకే మంచిది ' అని సలహా ఇచ్చి చక్కాపోయాడు దేవుడు.
దేవుడి మాట మేరకు జంతువులంతా కలసి తమ తరుపున రాయబారానికి పావురాయిని పంపించాయి .
పది రోజులు పాస్ అయ్యాయి.
పావురమెంతాకు తిరిగి రాలేదు.
మనిషి దగ్గర నుంచి సందేశం మాత్రమ వచ్చింది చిలుక ద్వారా!
' థేంక్స్... ఎన్నికల్లో గెలిచినందుకు మీరు పంపిన గిఫ్ట్ .. మహా టేస్టుగా వుంది' .
చెప్పాగా, మనిషి ఎంత మడతపేచీ గాడో! కనకనే నేనటు వేపు ఓటెయ్యంది. ఒట్టు... నన్ను నమ్మండి - అని ఇప్పుడు ఘొల్లుమనడం మొదల పెట్టింది. . పాపం .. శునకం.
మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆఒక్క ఓటూ ఎవరిది?
ఆ దేవుడికే తెలియాలి.
'మావాడికి ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివై పుట్టి రాజకీయాలలో పడిపోతావు - అని ఈ చిలక నా చెవిలో చెప్పి బెదరగొట్టింది . అదిరి పోయి నేనూ అటే ఓటెయ్యాల్సొచ్చింది - అంటూ బురదలో మొహం దాచుకుని భోరుమంది వరాహం .
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 07.11.2002 )
No comments:
Post a Comment