ఈనాడు - హాస్యం
గాడిద తెలివి
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - ( 10 -04 - 2009 ) ప్రచురితం)
రైలుమంత్రి లాలు ఆ మధ్య ఓ మేకను ఏకంగా మధురై నుంచీ ఢిల్లీదాకా ఏసీబోగీలో ప్రత్యేకంగా తోలించాట్ట! మేక కన్నా మా గాడిదలకు ఏం తక్కువ? హమ్ కిసీ సే కమ్ నహీ!
మాకూ నాలుగు కాళ్ళూ రెండు కళ్ళూ చేటచెవులూ, ముక్కూ, మూతీ అన్నీ వున్నాయి గదా! మరెందుకు ఈ మనుషులందరూ వెధవలందర్శీ మా పేరుతో 'గాడిదా .. గాడిదా' అని చీవరించడం ?
కోపం వస్తే 'అడ్డగాడిదా' అనే ఎందుకు తిట్టాలి? ఎవడు ఏ పోచికాలు పని చేసినా మా కొడుకుల్తోనే పోల్చి ఎందుకు ఆడిపోసుకోవాలి? వెధవ పన్లు చేసినవాడిని మామీదే ఎందుకు ఊరే గించాలి? వాడికి బుద్ధొస్తుందో లేదోగానీ మేం సిగ్గుతో చితికిపోతున్నాం.
పెట్రోలు రేట్లు పెరిగినప్పుడల్లా ఈ నేతలు వాహనాలను మాచేత ఎందుకు అసెంబ్లీ దాకా లాగించడమెందుకో ? మనిషిగాడికి ఇన్ని సేవలు చేస్తున్నా... విలువ దగ్గర కొచ్చేసరికి గాడిద గుండు సున్నానా? ఎన్నికల్లో గెలిస్తే గుర్రమంటారు, ఓడితే మా గాడిద పేరు మీద ఈసడిస్తారు. ఏమిటీ ఇన్ జస్టిస్?
వసుదేవుడంతటి వాడు మా కాళ్ళు పట్టుకున్నాడే! వినా యకుడంతటి దేవుడు మా 'శుక్లాంబరధరం' శ్లోకాన్ని వాడుకు న్నాడే . నంది పేరుతో అవార్డులిచ్చే వీళ్లకి కామెడీ కోసమైనా ఓ గాడిద అవార్డు ఇవ్వాలని తోచదెందుకో ?
లోకం కోడై కూస్తుందని రోజూ కోళ్ళ చేత 'యాడ్లు' చేయిస్తున్నారు. వాటిని నక్కల్లాగా మార్చి చూపిస్తున్నారు. కోళ్ళు కొక్కిరా యిల మీదే గానీ మా గాడిదల మీద మంచి ఐడియాలు రావా ఈ మనుషులకు ?
కాకులతో లెక్కలేయించేవాళ్ళు. . సింహాలతో గర్జనలు చేయించేవాళ్ళు మాదాకా వచ్చేసరికి 'గాడిద గుడ్డు' అని పక్కకు తోసేస్తున్నారు. ఎందుకిలా ? ఎంతకాలమిలా మా ఖర్మ కాలడం?
పంచతంత్రం నిండా బోలెడన్ని జంతువులున్నాయి. తెలివి తక్కువది ఒక్క గాడిద మాతామేనా? విష్ణుశర్మకు కూడా విజ్ఞత ఏమయిందో?
పంది గుడి చుట్టూ తిరిగిందని దానిచుట్టూ ప్రద క్షిణలు చేసే మూర్ఖులు , చంద్రమండలంలో భూములు అమ్మకానికి ఉన్నాయంటే మూఢులు .. వీళ్లా మమ్మాడిపోసుకునేది ?
నిజం చెప్పాలంటే ఈ నాయకుల కన్నా మేమే నయం. వెనక కాళ్లతో తన్నడమే తప్పించి వెన్నుపోట్లు పొడవం. పాలు ఇవ్వడమే మాకు తెలుసు. దేశాన్నింత దరిద్రంగా పాలించడం తెలియదు . అడ్డగాడిదలమైనా అడ్డమైన గడ్డికీ కక్కర్తి పడం.
చట్టసభల్లో చాకిరేవులు పెట్టం. దాడులకూ ఎదురుదాడులకూ ఆమడ దూరం మేం. పదవుల కోసం గోడలు దూకే రకాలం కాం. .
మేం అచ్చమైన గాడిదలం. స్వచ్ఛమైన గాడిద భాషలోనే నిత్యం వ్యవహరిస్తాం .
మా కంచర గాడిదలైనా ఈ మనుషుం టీవీ యాంకర్ణంతగా వంకర టింకరలుగు సకిలించవు.
గంజి తాగేవాడికి మేమే బెంజి. అదీ మా సామ్యవాదం . ఈ మానవుడే గుర్రాలకి గుగ్గిళ్ళు.. మాకేమో అవి తిని వూసిన చొప్పదంట్లు ! ఇదిక్కడె సహజన్యాయం ?
జనం పోగేసే మైలంతా మా మూపుల మీదే! మైళ్ళకొద్దీ మోసినా విశ్వాసం లేకుండా, మా కష్టానికి కనీసం కృతజ్ఞతయినా చూపకుండా ' గాడిద చాకిరి ' అంటూ చిన్న చూపు చూస్తారా ఈ పెద్దమనుషులు?
' గాడ్సు అంతా ఒకవైపు. గాడిద ఒక వైపు వుంటే.. గాడిదవైపే ఒరిగేను నేను' అని ఆ శ్రీనివాసే టైపులో గజిల్. అంతటి గౌరవం మీ మనుషుల నుంచి ఆశించలేం .. కానీ .. మినిమమ్ స్వాభిమానం ఉన్న జంతువుగా.. నైనా మా జాతిని గుర్తిస్తే అదే పదివేలు! ఒకాయన.
దేవుడు చేసినా మనుషులకు మాత్రమేనా.. అదే దేవుడు చేసిన గాడిదలకు మాత్రం మానాభిమానాలు ఉండ కూడదా ? హే! భగవాన్!
' గాడిద బిడ్డ గాడిదకు ముద్దు. సరేలే.. వచ్చా గానీ... ఇంతకే ఏమిటి నీ ఏడుపు? ఏం కావాలి నీకు! వాట్ డూ యూ వాంట్ .. డియర్ డాంకీ ?' అనడిగాడు అప్పటికప్పడు అక్కడ ప్రత్యక్షమయిన దేవుడుగారు.
'మార్పు రావాలి. గాడిద జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించే పనులు మానాలి. నాలుగు కాళ్లను ఏక కాలంలో చూసే నైపుణ్యం నీవిచ్చిన మా కళ్లది. తిట్టడాలు మాని మా తెలివిని చూసి బాగుపడమని నీవైనా మనిషికి బుద్ధిచెప్పాలి! '
' అట్లాగే.. కానీ.. ముందు కథ చెబుతా విను. అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. ఆ రాజుగారికో రోజు తలపోటొచ్చింది. ఏదైనా జంతువు మెదడు గొంతు దిగితే గాని ఆ రోగం నిదానించేలా లేదు . మెదడు దానం చేసిన్ జంతువుకు కోరిన పారితోషికం ఇవ్వబడుతుందని రాజావారి ప్రకటన వెలువడింది. ఆ అడవిలోనే మీ జాతి గాడిద ఒకటి ఉంది. దానికి చాలాకాలంగా రాచకొలువులో అమాత్య పదవి వెలగెట్టాలని మాహా కుతిగా ఉండేది. గాడిద కోరిక విని మృగరాజుగారు . . 'నో ప్రాబ్లమ్ ! అలాగే గానీ! కానీ, ముందు మరెవరినైనా ఓ మంత్రి పదవి నుంచి దిగిపోనీ . అందాకా నీ మెదడును నన్ను భోంచేయనియ్యి! నువ్వు వెయిట్ చెయ్ ' అంటూ ఆ గాడిద మెదడును ఇంచక్కా భోంచేనేసింది . అప్పటి బట్టి ఆ మెదడులేని గాడిద పాలిటిక్సులో తనవంతు మంత్రి పాత్ర పోషణ కోసం శోషొచ్చే దాకా ఎదురుచూస్తూనే ఉంది. ఈ కథ విన్నావు గదా! ఇప్పుడు నీకేం చేయాలనిపిస్తోంది! '
' నీ మీద పరువు నష్టం దావా వేయాలనిపిస్తోంది న' కసిగా అంది గాడిద .
'ఎందుకూ? నీకు మెదడు లేదు అన్నందుకా? '
' కాదు... నన్ను ఇప్పటి ఈ పాడు రాజకీయ నాయకులలోని నాయకులతో పోల్చి నందుకు' అంటూ మరో మాటా పలుకూ లేకుండా మూపు మీద మైల మూటతో హాయిగా చాకిరేవు వైపుకు సాగిపోయిందా తెలివైన గాడిద .
- కర్లపాలెం హనుమంతరావు
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయ పుట - ( 10 -04 - 2009 ) ప్రచురితం)
No comments:
Post a Comment