ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
తెల్లని కాకులు
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 14-09-2002 - ప్రచురితం )
మేటర్ చీపుగానే వున్నా.. పేపర్ కాస్ట్ లీ గానే వుందీ...!' అన్నాడు వెంకట్రావు వెటకారంగా.
చదువుతున్న ఆర్టిక చటుక్కున పక్కన పారేసి 'ఈ తెల్లకాకుల థీరీ ఏంటిగురూ! కొత్తగా వుందీ!' అన్నాడు తెల్లబోయి చూస్తూ.
వైటెలిఫెంట్సంటూ వున్నప్పుడు... వైట్ క్రోస్ మాత్రమెందుకుండ కూడదూ ? అని నా పాయింట్.
వైటెలిఫెంటంటే ఐరావతమని అర్థం. ఫ్యూరల్లో వాడితే ఏదో గవర్నమెంటెంప్లాయీస్ లాంటివాళ్లని సరిపెట్టుకోవచ్చు. అల్లుని మంచితనంబు... తెల్లని కాకుల్లాం టివి లేనేలేవని కదా సుమతీ శతక్కారుడు పదమూడో శతాబ్దం నుండీ మొత్తుకొంటున్నాడు!'
'అల్లుని మంచితనాన్ని గురించి బద్దెనగా రికి అంత పెద్దనుభవం లేక అలా అని ఉండొచ్చేమోగానీ మొన్నటిదాకా మంత్రిగా చేసిన మామగారొకాయన 'మా అల్లుడు బంగారం' అనేశాడే ఆ మధ్యన ! ... అదేదో కాగి తాలు... కార్బన్ పేపర్ల కుంభకోణం గొడవల్లో.
'రాజకీయాలను పరమపవిత్రంగా ఎంచే మహామంచి ప్రజాప్రతినిధిగారు ఒక ఆ వంక మామల్ను కిడ్నాపులు చేసే అల్లుళ్లున్న గడ్డుకాలంలో కూడా 'మా అల్లుడు దేవుడు' అని ఊరికే ఎందుకంటాడూ!'
'ముడుపులంటే ఇష్టపడతాడు కనక అల్లు డినలా కనపడే దేవుడని పొగిడుండొచ్చు కదా!
' కాదు. స్టేషనరీ స్కాము టైములో సనిన్లా అసలు స్టేషన్లోనే లేడని కదా ఆయన వాదన.. వేదన. నిజానికి, తనల్లుడు నోట్లో వేలు పెడితేనే కొరికేంత అమాయకుడని ఆయన భావన. తాను మారువేషాల్లో ఇసక లారీలను మసకచీకట్లో పట్టుకోవటం లాంటివి గిట్టని వాళ్లెవళ్లో కుట్ర పన్నుంటారని అంటున్నారాయన. గాంధీగారు కలలు కన్న పంచాయతీ రాజ్యంలో ఇంత పంచా యతీ జరుగుతుంటే దోషుల్ని పట్టుకోటం తన విధి కనక, ప్రజాప్రతినిధికి ప్రతినిధిగా అల్లుడుగారధికారులను తనదైన శైలిలో బుజ్జ గించే ప్రయత్నంలో... వాళ్ల పెళ్లాల మెళ్ల లోని తాళిబొట్ల నొక్కసారి గుర్తుచేయటం తప్పా!... పెద్ద పెద్ద అధికారులందరూ క్యూలో నిలబడి తమ తప్పుల్ని పేపర్లమీద కూడా ఒప్పుకొనేట్లు చేసిన తనజామాత భూమాతంత సహనశీలుడనీ, న్యాయవిచారణలో. . నిజానికి ఎలుగుబంటి వంటి వాడని ఆయననేకసార్లు కితాబిచ్చారు కూడా!'
'అదేంటీ' ... అల్లుడుగారినలా ఏకంగా భల్లూకంతో పోల్చేశాడాయన? '
'ఎలుగుబంటి ఒంటి కంటితో నిద్రపోతుంది కదా! ఎంత ఆదమరిచివున్నా ఎదుటి వాళ్ల మీద ఓ కన్నేసి వుంచేవాళ్లను ఎలుగు బంటితోనే పోల్చాడు శ్రీకృష్ణదేవరాయలు... తన ఆముక్తమాల్యదనే కావ్యంలో. అయి దొందలేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ లో జర గబోయే ఈ కాగితాల, కవర్ల కుంభకోణాన్ని ముందే ఊహించి చక్కని కధలా కూడా చెప్పుకొచ్చాడాయన...
ఆ శూలపృధువణి న్యాయాన్ని చెప్పమంటారా? '
' కతలు చెప్పటం నీకలవాటేగా... కానీయ్! '
'అనగనగా ఒక అవకతవకల రాజ్యం. దానిలో తెలివితక్కువ రాజు. అతాగానికో అతి తెలివి మంత్రి. రటమతం సేనాపతి.... మందమతి భటవర్గం!
ఓసారి జోరున కురిసిన్ వానలో ఇంటి కన్నం వేయటానికి చూరుకింద చేరిన దొంగమీద మట్టిగోడపడి బాగా గాయాలయ్యాయి.
దోషిని శిక్షించాలని రాజుగారి దగ్గర మొరపెట్టుకున్నాడు దొంగగారు.
' ఇంటి యజమానిని వెంటనే ఉరితీయండ' ని ఉరిమాడా ధర్మప్రభువు.
' నేరం నాది కాదు మహాప్రభో! జోరున కురిసే వానదికదా!' అని అతగాడు వేడుకోగా 'అదీ నిజమే... అయితే వాననే ఉరితీస్తేపోలా!' అనుకొని తన తీర్పు నప్పటికప్పుడు సవరించేసుకున్నారు రాజు గారు
'వానిప్పుడు లేదుకనక... మేఘాన్నైనా ఉరితీయొచ్చ'ని మరింత సవరణ చేయిం చారు మంత్రిగారు.
మేఘం ఆఘమేఘాలమీ దొచ్చి 'కుండలు ఆవం పెట్టిన పొగవల్లే కదా వానకురిసిందీ! కనక... పొగ పొగరే అణచా లని' ప్రాధేయపడితే పొగనెలాగూ ఉరితీయ లేము కనక... పొగబెట్టిన కుమ్మరిని పట్టుకు రండ'ని సేనాపతిగారు సెలవిచ్చారు.
'అయ్య వారింట్లో పెళ్ళికని అరవేణి కుండల ఆవం పెట్టాను. ఈ దారుణానికి కారణం పెళ్ళికొ డుకే కదా! ' అని కుమ్మరి వేడుకుంటే ఉదార బుద్ధిగల భటులు పాపమని కుమ్మరినొదిలేసి, పెళ్ళిపీటల మీదున్న పెళ్ళికొడుకును ఆర్భా టంగా ఈడ్చుకొచ్చారు.
మోకు లావుగా ఉంది. పెళ్ళికొడుకు మెడ బక్కగా ఉంది. ఉరి జారిపోతుందేమోనని దారినపోయే ఒక లావుపాటి వ్యాపారిని పట్టుకొచ్చి తల తీసేసి ఒక పనయిందనిపించాడు తలారి.
వ్యాపారి లంచం ఇస్తానన్నా సమయం మించిపో యింది . విషయం రాజుగారిదాకా పాకింది. ఈసారికి మాత్రం ఉరితోనే సరిపె ట్టుకో ! అని వాపోయాడట, పాపం, తలారి! '
' తలారి వృత్తి ధర్మదృష్టి ఐదొందల సంవత్స రాల తరవాత కూడా ప్రభుత్వానికిలా స్ఫూర్తినివ్వటం ప్రశంసనీయమ'ని అనాలా.. వద్దా అని నేను సంశయిస్తుంటే
'ఇంక నువ్వీ రాతలూ, కోతలూ కట్టిబెట్టి.. ఒక మైకు సెట్టు పెట్టుకుని , బాడుగ రిక్షాలో నాలుగు రోడ్లలో తిరుగుతూ, ఏ కూడల్లోనో నీ ఈ ఐడియాలు... అవీ వినిపించటం బెటరనిపి స్తుంది గురూ!' అనేశాడు. వెంకట్రావు.
ఆ మాటా నిజమే. షీటు ఐదు రూపా యలు! రెండు గుండు పిన్నులు రెండ్రూపా యలు!! అంటుకున్నా... అంటుకోకపోయినా ఈ గవర్నమెంటు గమ్ బాటిల్ నూటిరవై రూపాయలు!!!
పంచాయతీరాజ్ అంతా పంచాయితీ అయిపోయింతరవాత మావీధి చివరి పుస్తకాలమ్ముకొనే వీరాస్వామి కూడా గవర్నమెంటు కొన్న రేటుకు తప్ప తక్కువకు అమ్మమంటున్నాడిప్పుడు!
'అందుకే మన ముఖ్యమంత్రిగారు పేపర్ లేని ఆఫీసులు కావాలని కలవరిస్తుంటారెప్పు డూ! '
'కంప్యూటర్ వ్యవహారాల్లో మాత్రం ఈ కంపు లేదంటావా? అంతా వైటెలిఫెంట్స్ మాయ సుమా! అందుకే... తెల్లేనుగులు న్నంత కాలమూ... తెల్లకాకులు కూడా ఉండాలని నా థియరీ!
ఇంటి గుట్టు పట్టుకోవ టానికి... ఇలాంటి ఫీట్లు తప్పవని
ఆముక్త మాల్యదలో కూడా రాయలువారు ఏమూలో ముక్తాయించుంటారు. ముఖ్యమంత్రిగారా ముక్కలు కాస్త చెవికెక్కించుకుని తెల్లని కాకుల్లాంటి మంచి అల్లుళ్లున్న పవిత్ర ప్రజా ప్రతినిధులకే మంత్రివర్గంలో చోటిస్తే... ఇదిగో... ఈ స్కాములు గట్రా బైటపడినప్పుడు... దోష నిర్ధారణలో ప్రభు త్వానికి శ్రమ బాగా తగ్గుతుందని నా అభిప్రాయం.
సుమతీ శతకం రాసినాయనకు ఇంత చిన్న సూత్రం ఎందుకు తట్టలేదు సుమా! ... తెల్లని కాకులే లేవనేశాడూ...!' అని ఆశ్చర్యపోయాడు వెంకట్రావు .
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 14-09-2002 - ప్రచురితం )
No comments:
Post a Comment