ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
రాయలుకేం తెలుగు మన మాయలు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 22-07-2010 )
'అవును బాబాయ్' ఆ రాయలు మన అధిష్ఠానం మనిషన్నా కాదు, భయం నటించి ఆర్భాటంగా అంత లావున ఉత్సవాలు చేసి పారేయడానికి! మనం ఆ కృష్ణరాయల్ని తలచుకోని క్షణమెక్కడున్నది చెప్పు! రాజగోపురాలు కూలినప్పుడల్లా- ఆ రాజుగారు గుర్తుకొస్తూనే ఉన్నారాయె!
'అవునురా అబ్బాయ్! కళింగ యుద్ధానికి ముందు దేవే రులిద్దరితో కలిసి ఆ ధర్మాత్ముడు తిరుమల వేంకటేశ్వరస్వామికి చేయించిన నవరత్న ఖచిత కిరీటాలు, బంగారు ఆభరణాలు... రాళ్ళతో సహా కరిగి మాయమైపోయాయని బయటపడినప్పుడు, ఆ మహారాజే గుర్తు కొచ్చి మనసు పాడైపోయిందనుకో! చేసేవన్నీ చేసి, మళ్లీ ఆ రాయలవారి పాలన వస్తే బహుభేషుగ్గా ఉంటుందని సంస్కరణ సభలో సర్కారు పెద్దమంత్రే పెద్ద అభిభాషణ చేశాడు... చూడు! అదే తమాషా!'
'మాట వరసకేదో అలా అన్నాడులే బాబాయ్, నువ్వు అన్నీ పొల్లుకు పొల్లు పట్టించుకుంటావు! నిజంగా ఆ రాయలవారే గనక తిరిగివస్తే మన నాయకులు తి ట్టుకొంటారు కూడా. '
'అసలు ముందు ఆ మహరాజు ఇక్కడి పరిస్థి తులు చూసి తట్టుకోగలడా- ఆ సంగతి చెప్పు1 కన్న తల్లి భాషను వదిలి, కన్నడ రాజ్యం భాషను వదిలి. . తమిళ ఆళ్వారుగారమ్మాయి ప్రేమకథను మన భాషలో అంత చక్కగా రాసిన ఆ బహు భాషాభిమా నికి భాష పేరుతో ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూసి పిచ్చెక్కిపోదా! దేశభాషలందు తనకు లెస్సగా తోచిన తెలుగు పలుకులను 'ఎన్నడూ పలకనని' పల కమీద రాసుకుని మరీ మెడల్లో వేలాడేసుకుని తిరిగే ముక్కుపచ్చలారని పిల్లల్ని చూసి ముక్కమీద వేలేసు కోకుండా ఉంటాడా? '
'నిజమే బాబాయ్! తాను రాజగౌరవమిచ్చి ప్రోత్స
హించిన భాషను తెలుగువారై ఉండీ తెలుగు ప్రజా ప్రతినిధులు చివరికి చట్టసభల్లో కూడా తప్పకపోతే తప్ప మాట్లాడని దుస్థితిని చూసి కచ్చితంగా అవాక్క వటం ఖాయం!'
' భాష సంగతి అలా వదిలేయ్! నాయకుల సంగతి మాత్రం అంతకన్నా నయంగా ఉందా! ఓడిన వాళ్ళ మీద కూడా బోలెడంత ఔదార్యం చూపించి ఆదరించేవాడట ఆయన. అంతటి ఉదార హృద యుడు- నేడు ఎన్నికల్లో నిలిచి గెలిచినవాడి మీద కూడా... మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా బురదజల్లటమే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుని ఉండే మన ప్రజాప్ర తినిధులను చూసి నీరుకారిపోడా!'
' సరేలే, ముందుండి సైన్యాన్ని నడిపించిన ఆ వీరుడెక్కడ... వెనక ఉండి జనాలను తుపాకీ గుండ్లకు బలిపెట్టే మన శూరులెక్కడ? ఆ భోజరాజుకీ మన భోజనరాజులకీ పోలికెక్కడలే బాబాయ్! ఒకందుకు మాత్రం మన నేతలు ఆజన్మాంతం ఆ రాయలువారికి రుణ పడి ఉండి తీరాలి. ప్రజాహిత పక్షపాతి కనక వ్యవ సాయం కోసం అలా ఉరూరా తటాకాలంటూ తవ్వి పెట్టుంచుకపోతే... ఇప్పుడు వాటిని పూడ్చి ప్లాట్లేసుకుంటూ కోట్లకుకోట్లు సొమ్ము చేసుకునే అవకాశమే ఉండేది కాదుగా! మన నేతలకు అయినా ఆ రాయలకు మనవారి మాయలు అంతగా అర్ధంకావులే బాబాయ్ ! పొగడ్తలకి పొంగి నిజంగానే దివి నుంచి కిందకు దిగి వచ్చేస్తే .. తన పేరు చెప్పుకొని నాయకులుచేసే ఆర్భాటాలకు, ఆరాటాలకు మళ్లీ ఆయన పాతాళంలోకి పారిపోవాలి !'
' నిజమేరా నాయనా! ఏ పనైనా తల్చుకోగానే తక్షణం అమల్లో పెట్టనిదీ తోచని ఆ రాయలు తన పంచశతాబ్ది పట్టాభిషేకోత్సవాన్ని... ఏడాది గడిచిన తరువాత ఏదో మొక్కుబడిగా చేసిన మన సర్కారు వారి చిత్తశుద్ధిని చూసి... పాతాళానికేం ఖర్మ- దాని కిందన ఉన్న రసాతలందాకా ఉరుక్కుంటూ పోవా ల్సిందే! నన్నడిగితే ఆ రాయలు తిరిగిరాకుండా ఉంటేనే మంచిది. నవరత్నాలు రాసులుగా పోసి అమ్మిన ఆ నాటి నగరాల్లో ఇవాళ బస్సులమీదో, ఎదు టిపక్షం వాళ్ళమీదో విసరటానికి రాళ్ళను కుప్పలుగా పోసి ఉండటం చూస్తే- తట్టుకోలేడు। తన భువన విజయాన్ని మించి వెలిగిపోతున్న నేటి నేతల భవన విజయాలను చూసి బిత్తరపోతాడు! తిరుమల నుంచి సింహాచలం దాకా దాదాపు అన్ని దేవాలయాలకు భూరి విరాళాలిచ్చి ఏ మాత్రం గీర లేకుండా తిరుమలేశుని మహాద్వారం దగ్గర రెండు చేతులూ జోడించి నిలబడ్డ ఆ సార్వభౌ ముడు, జైళ్ళపాలై జడ్ కేటగిరీ సెక్యూ రిటీలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లకోసం వెంపర్లాడు తున్న మన నేతలను చూసి ' ఆహా ! వీళ్లా నా వారసుల' ని నీరసపడిపోతాడు. రాయలవారు రాకపోవటమే మేలు! '
'రాడులే బాబాయ్, మరీ అంత బెంగొద్దు! ఒకవేళ వచ్చినా, మనసర్కారు ' మద కరీంద్రము డిగ్గి కేలు పట్టి' ఆయనకు గజారోహణం చేయించడానికి తయారుగానూ లేదు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, మధ్యమధ్యలో మినీ ఎన్నికల జాతరలతో క్షణం తీరిక లేకుండా ఉన్న మన ప్రభువులకు ప్రస్తుతం అధిష్ఠానం పురమాయిస్తే తప్ప ఆ తెలుగు వల్లభుడు వచ్చినా పూలమాల వేయటానికైనా సాహసం ఉండదు. అయినా, ఏ రాయలు వస్తే మాత్రం ఎవరికి కావాలి? సామాన్య జనానికి కావా ల్సింది కనీసం కిరసనాయిలు ధరన్నా దిగిరావటం!'
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 22-07-2010 )
No comments:
Post a Comment