ఈనాడు - గల్పిక
మహర్జాతకం
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- తేదీ తెలియదు ) Editorial,Eenadu,
సభలో పంచాంగం చదివిన పంతులుగారేమ న్నారో తెలుసా?
ఏమన్నారూ?
ఈ సంవత్సరం చిత్రభాను గనక చిత్రంగా అంతా మంచే జరుగుతుందని జోస్యం చెప్పారు.
నా వరకు నాకు ఆ జ్యోతిష్యం నిజమే అయిందనిపి స్తుంది. సంసారం, ఝంఝాటం లేకుండా హాయిగా వున్నాను. అప్పులూ, చాలీచాలని జీతం, ఎప్పుడూ పెరిగే ధరలు, వేపుకుతినే వెళ్ళాం, వేధించే పిల్లకాయలు, టీవీ సీరి యల్సూ పొగతో నిండిన రోడ్లు, పొగరుబోతు మనుషులు, లంచగొండి ఉద్యోగస్తులూ, కాకారాయుళ్ళు, కల్తీ సరుకులు, గతుకుల రోడ్లు, నీటి ఎద్దడి, అమెరికా పిచ్చి. . ఏవీ లేకుండా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా, తేలిగ్గా తెరి పిగా వున్నాను. పంతులుగారు చెప్పింది నా విషయంలో మాత్రం నూరు పాళ్లు నిజమే అయింది సుమా!
అదే పంతులుగారు నాకు జాతకచక్రం వేసిచ్చారు. జీవి తకాలం జోస్యం పది పేజీలు రాసిచ్చారు. ఫీజూ వెయ్యి రూపాయలు.. సమయానికి దగ్గరలేక అయిదొందలే ఆయన చేతిలో పెట్టా అప్పుడు. మొన్న ఇంట్లో దొరికిందీ జాతకం.
దగ్గర వుంటే చదవరాదూ.. .. కాలక్షేపమవుతుంది
కాలక్షేపానికెవరన్నా ఫిక్షన్ చదువుకుంటారు. న్యూస్ పే పర్ చదువుకుంటారు. జాతకచక్రాలు చదువుకొంటారా!
పుర్రెకోబుద్ధి.. పూటకోరుచి.. వెరైటీగా వుంటుంది. చద వరాదూ!
సరే విను ! పంతులుగారు నాకు డెబ్బైయ్యేళ్ల ఆయుష్షు ప్రసాదించారు. గురువు, శని ఒకే ఇంట్లో కలుసుకుంటున్నందు వల్ల రాబోయే పది సంవత్సరాలు నాది మహర్జాతకం అనేశారు . ఆదాయం.. వ్యయం ఈ పదేళ్ళల్లోనూ అనులోమానుపాతంలో ఉంటుందని ఆశపెట్టారు . ఈ సంవ త్సరానికైతే ఆదాయం 15 వ్యయం ఒకటి. రోగాలూ చొప్పులూ ఉండవు. ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం. బదిలీ వుండదు. భార్య ఆరోగ్యం బాగుపడుతుంది. పిల్లకి మంచి సంబంధం కుదురుతుంది. పిల్లాడు అమెరికా వెళతాడు. ఇల్లు కట్టుకోవటం పూర్తవుతుంది. అనుకోని వైపు నుంచి ఆస్తి లాభం . అన్నదమ్ములతో స్నేహం కుదురుకుంటుంది . పుణ్యక్షేత్రాలు వెళ్ళి వస్తారు. చరాస్తి పెరుగుతుంది. పాత అప్పులు వసూలు అవుతాయి. అధికారులు అనుగ్రహానికి పాత్రులవుతాను . సినిమాల్లో అవకాశం వస్తుంది.
ఇహనేం! నీ జీవితాశయం నెరవేరబోతుంది. నువ్వు మాటలు, పాటలు రాయాలని తెగ ఉవ్విళ్ళూరి పోయే వాడివి కదా!
ఇంకా విను. దానాలు చేస్తాను. సోషల్ వర్క్ కూడా చేస్తానని రాశారు.
నిజమే మరి. నువ్వీ మధ్య రచనలూ అవీ చేయటం లేదు గదా! ...
సెటైరా! సరే. ఇలాగే ఏవో చాలా చాలా రాశారు .
ఫీజు వెయ్యి రూపాయలకు ఒప్పుకున్నావయ్యే మరి. ఆ మాత్రం బరువుండొద్దూ!
కానీ అందులో అయిదొందలే ఇచ్చానన్నాగా అప్పుడు. మిగిలిన అయిదొందలు ఇవ్వకుండానే ఇలాగయ్యింది..
డెబ్బైయ్యేళ్లు గ్యారంటీ అన్నారుగా! ఎప్పుడో ఎక్కడో తారసపడతారు . అప్పుడివ్వచ్చులే!
కానీ ఎలా ఇచ్చేది?
మెసెంజరొచ్చి డిస్టర్బ్ చేశాడు.
మీటింగుకు టయమయిపోతుంది . మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. మన 'దయ్యాల సంఘం'లో కొత్త మెంబర్ చేరబోతున్నాడు. పరిచయం చేస్తారంట- అని వెళ్ళిపోయాడు మెసెంజరుదయ్యం.
కొత్త మెంబర్ను చూసి కంగు తినటం మావంతయింది.
సభలో పంచాంగం చెప్పిన పంతులుగారే! వయస్సు కూడా ఆట్టీ ఏం లేదు . . పాపం
ఎలా జరిగింది?- అని అడిగాను సానుభూతిగా,
వచ్చే ఏడాది పంచాంగానికి మేటర్ తయారుచేసే పని 'మధుర పోతున్నాను. ట్రైన్ ఎక్సిడెంటయింది... మీరూ...
ఏభై ఏళ్ళు బతుకుతానని మీరు దివ్యమైన జాతకం చ్చారుగా! ఆ కాగితాలు పట్టుకుని హుషారుగా ఇంటి స్తుంటే.. లారీ గుద్దేసింది నడిరోడ్డు మీద...
ఐ యామ్ సారీ..! అన్నారు పంతులుగారు. "
దీన్ని బట్టి మనం జాతకాలని నమ్మాల్సిన పనిలేదు. రుజువయిందిగా! - అన్నాన్నేను.
ఇదివరకు నేను నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నమ్ము తాను- అనేశాడు నా మిత్రుడు.
ఇంత చూసిన తరువాత కూడానా !
అందుకే మరి.. పంతులుగారేమన్నారు? నీ దగ్గరా మిగిలినా బాకీ అయిదొందలు ఎప్పటికైనా వసూలు చేసుకొంటానన్నారు గదా! వసూలు చేసుకోవటానికి ఎక్కడిదాకా వచ్చాడో చూశావా!.. కాబట్టి జోస్యం సత్యం అన్నాడు- మిత్రుడు.
అతని వంక జాలిగా చూడటం తప్ప నేను మాత్రం చేయగలి దేముంది!
***
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- తేదీ నమోదు చేయలేదు )
No comments:
Post a Comment